ASUS ROG Laptops: ASUS నుంచి కొత్త AI ల్యాప్టాప్స్.. క్రియేటర్లు, గేమర్ల కోసం ప్రీమియం ROG లైనప్ విడుదల
- ASUS నుంచి కొత్త AI ల్యాప్టాప్స్
- కొత్త ROG (Republic of Gamers) లైనప్‌లో అధునాతన AI ఫీచర్లు, NVIDIA RTX 50 సిరీస్ గ్రాఫిక్స్
- AI పనితీరుతో నెక్స్ట్-జెన్ అనుభవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తైవాన్‌కు చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ ASUS భారత మార్కెట్లో ప్రీమియం గేమింగ్, క్రియేటర్ ల్యాప్‌టాప్‌ల సిరీస్ ను విడుదల చేసింది. కొత్త ROG (Republic of Gamers) లైనప్‌లో అధునాతన AI ఫీచర్లు, NVIDIA RTX 50 సిరీస్ గ్రాఫిక్స్, శక్తివంతమైన ప్రాసెసర్లు, స్టైలిష్ డిజైన్లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ కొత్త లైనప్‌లో ROG Zephyrus Duo, ROG Zephyrus G14, ROG Zephyrus G16, TUF Gaming A14, ProArt PZ14 వంటి మోడళ్లు ఉన్నాయి. గేమర్లు, కంటెంట్ క్రియేటర్లు, డిజైనర్లు, ప్రొఫెషనల్స్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ల్యాప్‌టాప్‌లను రూపొందించారు.
AI పనితీరుతో నెక్స్ట్-జెన్ అనుభవం
కొత్త ASUS ROG ల్యాప్‌టాప్‌లలో సరికొత్త Intel Core Ultra, AMD Ryzen AI, Qualcomm Snapdragon X సిరీస్ ప్రాసెసర్లను ఉపయోగించారు. వీటికి NVIDIA GeForce RTX 50 సిరీస్ GPUలు జత కావడంతో గేమింగ్, వీడియో ఎడిటింగ్, 3D రెండరింగ్, AI వర్క్‌ఫ్లోలు మరింత వేగంగా నిర్వహించవచ్చు. ప్రత్యేక NPU (Neural Processing Unit) సపోర్ట్‌తో 80 TOPS వరకు AI పనితీరును అందించేలా ఈ ల్యాప్‌టాప్‌లు రూపొందించబడ్డాయి. దీంతో AI ఆధారిత టాస్కులు, కంటెంట్ క్రియేషన్, మల్టీటాస్కింగ్ మరింత సమర్థవంతంగా సాగుతాయి.
Also Read
- Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
- Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
డ్యూయల్ OLED స్క్రీన్‌తో Zephyrus Duo
ఈ లైనప్‌లో అత్యంత ప్రత్యేకమైన మోడల్ Zephyrus Duo. ఇది ప్రపంచంలోనే తొలి డ్యూయల్ 16-అంగుళాల OLED గేమింగ్ ల్యాప్‌టాప్‌లలో ఒకటిగా నిలుస్తోంది. రెండు OLED స్క్రీన్లతో మల్టీటాస్కింగ్, లైవ్ స్ట్రీమింగ్, వీడియో ఎడిటింగ్ వంటి పనులు మరింత సులభమవుతాయి.
క్రియేటర్ల కోసం ప్రత్యేక ProArt PZ14
కంటెంట్ క్రియేటర్లు, డిజైనర్లు, వీడియో ఎడిటర్ల కోసం ASUS ప్రత్యేకంగా ProArt PZ14ను తీసుకువచ్చింది. AI ఆధారిత ఫీచర్లు, అధిక పనితీరు, పోర్టబుల్ డిజైన్‌తో ఇది క్రియేటివ్ వర్క్‌ఫ్లోలను వేగవంతం చేయడానికి రూపొందించబడింది.
ASUS ROG ల్యాప్‌టాప్‌ల ధరలు
ProArt PZ14 -రూ.2,69,990
TUF Gaming A14 -రూ.1,99,990
Zephyrus G14 Refresh -రూ.2,59,990 నుంచి
Zephyrus G14 RTX 5070 -రూ.3,69,990
Zephyrus G16 RTX 5070 Ti -రూ.4,19,990 నుంచి
Zephyrus G16 RTX 5080 -రూ.5,09,990
Zephyrus Duo RTX 5070 Ti -రూ.5,49,990
Zephyrus Duo RTX 5090 -రూ.6,99,990
ఎక్కడ కొనుగోలు చేయవచ్చు?
ఈ కొత్త ASUS ROG ల్యాప్‌టాప్‌లు ASUS Exclusive Stores, ROG Stores, ASUS e-Shopతో పాటు Amazon India, Flipkart, Reliance Digital, Croma, Vijay Sales స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. అదనంగా ASUS Easy Pay ద్వారా 18 నెలల వరకు 0% వడ్డీ EMI సదుపాయం కూడా కల్పిస్తోంది.
AI ఆధారిత పనితీరు, RTX 50 సిరీస్ గ్రాఫిక్స్, OLED డిస్ప్లేలు, శక్తివంతమైన ప్రాసెసర్లతో ASUS కొత్త ROG లైనప్ గేమర్లు, కంటెంట్ క్రియేటర్లు, పవర్ యూజర్ల కోసం రూపొందించారు. అధిక పనితీరు, ప్రీమియం డిజైన్, నెక్స్ట్-జెన్ AI అనుభవాలను కోరుకునే వారికి ఈ ల్యాప్‌టాప్‌లు ఆకర్షణీయమైన ఎంపికగా నిలవనున్నాయి.
- Tags
- Asus
- ASUS ROG laptops
తాజావార్తలు
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!