Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pesara Payasam: తీపి తినాలనిపించినప్పుడు రుచికరంగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే వంటకం కోసం చూస్తుంటే ‘పెసరపప్పు పాయసం’ బెస్ట్ ఛాయస్ గా నిలుస్తుంది. పెసరపప్పు, బెల్లం, కొబ్బరి, పాలు వంటి పోషకాలు అధికంగా ఉండే పదార్థాలతో తయారయ్యే ఈ పాయసం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ప్రత్యేక సందర్భాల్లోనే కాదు.. సాధారణ రోజుల్లో కూడా ఈ పాయసాన్ని సులభంగా తయారు చేసుకుని ఆస్వాదించవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!
కావాల్సిన పదార్థాలు:
* పెసరపప్పు – 2 కప్పులు
* బెల్లం – తగినంత
* నీరు – అవసరమైనంత
* పాలు – కొద్దిగా (కాచినవి)
* తాజా కొబ్బరి తురుము – 1 కప్పు
* జీడిపప్పు – కొద్దిగా
* కిస్మిస్ (ఎండు ద్రాక్ష) – కొద్దిగా
* యాలకుల పొడి – 1 టీ స్పూన్
* నెయ్యి – 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు
Also Read
- Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
- Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
- Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
తయారీ విధానం:
ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి ఒక గంటపాటు నీటిలో నానబెట్టుకోవాలి. అనంతరం నానబెట్టిన పప్పును ప్రెషర్ కుక్కర్లో వేసి పప్పు పూర్తిగా మునిగేలా నీరు పోసి మీడియం మంటపై ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. పప్పు మెత్తగా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పును బంగారు రంగు వచ్చే వరకు వేయించి తీసి పెట్టుకోవాలి.
అదే పాన్లో కిస్మిస్ వేసి పొంగే వరకు వేయించి పక్కన పెట్టాలి. తరువాత మరికొద్దిగా నెయ్యి వేసి తాజా కొబ్బరి తురుమును ఐదు నిమిషాల పాటు తక్కువ మంటపై వేయించుకోవాలి. మరో పాత్రలో బెల్లంను కొద్దిగా నీరు వేసి బెల్లం పూర్తిగా కరిగే వరకు వేడి చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని వడకట్టి ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఇందులో ముందుగా ఉడికించిన పెసరపప్పును వేసి మీడియం మంటపై ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.
ఆ తర్వాత కాచిన పాలను జత చేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. చివరగా యాలకుల పొడి, వేయించిన కొబ్బరి తురుము, జీడిపప్పు, కిస్మిస్ మరియు కొద్దిగా నెయ్యి వేసి బాగా కలపాలి. మరో రెండు నిమిషాలు మరిగించిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే హెల్తి ‘పెసరపప్పు పాయసం’ రెడీ. వేడి వేడిగా సర్వ్ చేస్తే ఈ పెసరపప్పు పాయసం అద్భుతమైన రుచిని అందిస్తుంది. బెల్లం తీపి, కొబ్బరి సువాసన, నెయ్యి రుచి కలగలిసి ప్రతి ముద్దను మరింత ప్రత్యేకంగా ఆస్వాదించవచ్చు .
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!