టీడీనీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడి సతిమణీ నారా భువనేశ్వరిని పార్టీ కార్యక్రమాల్లో యాక్టివేట్ చేయాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. నిజం గెలవాలి పేరుతో వచ్చే వారం నుంచి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఆమె పర్యటించనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టు వల్ల ఆవేదనతో మృతి చెందిన బాధిత కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు. వారానికి కనీసం రెండు మూడు చోట్ల భువనేశ్వరి పర్యటన ఉండేలా తెలుగుదేశం పార్టీ ప్రణాళిక వేసింది.
Read Also: Russia: “అణు పరీక్ష నిషేధ ఒప్పందాన్ని” రద్దు చేసుకున్న రష్యా..
చంద్రబాబు అరెస్టుతో ఆగిన భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు స్థానంలో జనంలోకి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెళ్లనున్నారు. పార్టీ కార్యక్రమాలపై నిర్వహణ, సమీక్షపై నాలుగైదు రోజుల్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. చంద్రబాబుతో నేను కార్యక్రమం నిర్వహిస్తూనే ప్రజల సమస్యలపై పోరాటాలు, పార్టీ కార్యక్రమాల స్పీడు పెంచాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది.