తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుటుంబ సభ్యులను ఇవాళ బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ తరుణ్ చుగ్ పరామర్శించారు. బండి సంజయ్ అత్తమ్మ వనజ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో బండి సంజయ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత కరీంనగర్ లో తరుణ్ చుగ్ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. బండి సంజయ్ ని ఏప్రిల్ 5న అర్ధరాత్రి కేసీఆర్ కనుసన్నల్లో అరెస్ట్ చేశారని ఆరోపించారు. దేశ రాజ్యాంగంపై ప్రమాణం చేసిన అధికారులు రాజ్యాంగ హక్కుల్ని కాపాడాల్సింది పోయి కేసీఆర్ కోసం పని చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎలాంటి వారెంట్ లేకుండా అరెస్ట్‌కు పూనుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. అవినీతిని అక్రమాలను ప్రశ్నిస్తున్న వారిపై కేసీఆర్ సర్కారు అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Snake: ప్రైవేట్ పార్ట్ ద్వారా పాము శరీరంలోకి వెళ్లిందని ఆస్పత్రికి పరుగెత్తాడు.. తర్వాత ఏమైందంటే?
ఏ కేసు అనేది చెప్పకుండా నిర్బంధిస్తున్నారని, కేసీఆర్ పాలనలో జంగిల్ రాజ్యం నడుస్తోందని ఆయన విమర్శలు గుప్పించారు. కేసీఆర్ 30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ తో ఆటలాడుతున్నారని, టీఎస్పీఎస్సీ లీక్ లో కేసీఆర్ కుటుంబ హస్తం ఉందని ఆయన అన్నారు. తెలంగాణలో లీకుల రాజ్యం నడుస్తోందని, లిక్కర్ మాఫియా, లీకుల మాఫియా నడుస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో మంత్రిమండలి అలిబాబా 40 దొంగలుగా తయారైందంటూ తరుణ్ చుగ్ నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరుద్యోగుల తరపున వాణిని వినిపిస్తున్న సంజయ్ ని అరెస్ట్ చేశారని, అర్ధరాత్రి హంతకుడిని తరలించినట్టు ఒక పార్లమెంట్ సభ్యున్ని అరెస్ట్ చేశారని, బండి సంజయ్ ఫోన్ ని పోలీసులు తీసుకెళ్లారని, కేసీఆర్ పోలీసులు మొబైల్ దొంగలుగా మారారన్నారు.
Also Read : Samnatha: న్యూడ్ సీన్స్.. సమంత మళ్లీనా..?