Thamma reddy : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పుష్ప 2 బెనిఫిట్ షోలో భాగంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె కుమారుడు ఇప్పటికీ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటన కారణంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం సినిమా సెలబ్రిటీలు జీర్ణించుకోవడం లేదనే చెప్పాలి. తాను ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రోజులన్నీ కూడా తెలంగాణలో బెనిఫిట్ షోలు, సినిమా టికెట్ల రేట్ల పెంపు అనేది ఉండదని తేల్చి చెప్పారు రేవంత్ రెడ్డి. ఇలా అసెంబ్లీలో ఈయన చేసిన వ్యాఖ్యల పట్ల కొంతమంది సినీ పెద్దలు నిన్న సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇక ఈ భేటీలో కూడా రేవంత్ రెడ్డి తాను ఇచ్చిన మాట మీదే నిలబడి ఉన్నానని తన నిర్ణయం మార్చుకునేదే లేదన్నారు.
Read Also:IND Vs WI: దీప్తి శర్మకు ఆరు వికెట్లు.. 162 పరుగులకు వెస్టిండీస్ ఆలౌట్! ఇంకా 89 పరుగులు
ఈ విధంగా రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కారణంగా ఎంతో మంది నిర్మాతలు నష్టపోతున్నారు. అయితే రేవంత్ రెడ్డి నిర్ణయంతో కొంతమంది సీనియర్ సెలబ్రిటీలు అల్లు అర్జున్ హీరోని తప్పుపడుతూ ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ నటుడు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ సైతం ఇదే అంశం గురించి స్పందించారు. అల్లు అర్జున్ పట్ల తీవ్ర విమర్శలు చేశారు.
Read Also:Abdul Rehman Makki: ముంబై ఉగ్రదాడుల కుట్రదారు అబ్దుల్ రెహ్మాన్ మక్కీ మృతి
ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ..‘‘ ఒక్క మనిషి కోసం ఆయన మర్డర్ చేశాడని నేను అనడం లేదు. అయితే తప్పు అయితే జరిగింది. రోడ్ షో చేయడం వల్ల తెలియకుండా ఈ ఘటనకు తను బాధ్యుడు అయ్యారు. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఆయన మరికొన్ని తప్పులు చేయడం వల్ల నేడు సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలందరూ కూడా సీఎం ముందు కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక మనిషి కోసం అతని ఇగో కోసం ఇంతమంది తల వంచాల్సి వచ్చిందన్నారు. అల్లు అర్జున్ విషయంలో తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.