Here is Side-Effects of Sugarcane Juice: వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వేడి తాపాన్ని తట్టుకోలేక చాలా మంది ‘చెరుకు రసం’ తాగుతుంటారు. ఇది శరీరాన్ని డీ హైడ్రేట్ కాకుండా ఉంచుతుంది. చెరకు రసంలో శరీరానికి చాలా ముఖ్యమైన కాల్షియం, కాపర్ మరియు ఐరన్ ఉంటాయి. రోజూ చెరుకు రసం తాగితే.. శరీరంలోని రక్తహీనత తొలగిపోతుంది. అయితే కొంతమంది మాత్రం చెరుకు రసం అస్సలు తాగకూడదు. పొరపాటున తాగారో ఆసుపత్రి పాలవవుతారు. ఏయే వ్యక్తులు చెరుకు రసం (Sugarcane Juice Side Effects) తాగకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
జలుబు, దగ్గు:
చెరకు రసం చల్లదనాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి మీకు జలుబు లేదా దగ్గు ఉంటే.. చెరకు రసం తాగడం మానుకోవాలి. లేకపోతే మీ సమస్య పెరుగుతుంది. జలుబు లేదా దగ్గు ఉన్నవారు చెరకు రసం జోలికి పోకూడదు.
మధుమేహం:
చెరకు రసంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిక్ రోగులకు హాని కలిగిస్తుంది. అందుకే డయాబెటిక్ పేషెంట్లు పొరపాటున కూడా చెరుకు రసం తాగకూడదు.
Also Read: Raw Onion Disadvantages: పచ్చి ఉల్లిపాయ ఆరోగ్యానికి హానికరం.. ఏమవుతుందో తెలుసా?
కడుపు నొప్పి:
ఏదైనా కడుపు సమస్య ఉంటే చెరుకు రసం తాగకూడదు. ఎందుకంటే కడుపులో ఇబ్బంది ఉన్నప్పుడు మీ జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది. ఈ సమయంలో చెరకు రసం తాగితే సమస్యలు వస్తాయి. కడుపు నొప్పి వచ్చినప్పుడు చెరుకు రసం తీసుకోకూడదు.
దంతాల సమస్య:
దంతాలలో పుచ్చు సమస్య ఉన్నవారు కూడా చెరుకు రసం తాగకూడదు. దంతాలకు హాని కలిగించే సహజ చక్కెరను ఇది కలిగి ఉంటుంది. దంతాలకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు చెరుకు రసం తాగకూడదు.