SS Rajamouli Dance Video Goes Viral: టాలీవుడ్ దర్శకధీరుడు ‘ఎస్ఎస్ రాజమౌళి’ స్టేజ్‌పై చాలా తక్కువగా మాట్లాడుతాడన్న విషయం తెలిసిందే. తన సొంత సినిమా ప్రమోషన్లు, తెలిసిన వారి సినిమా ఈవెంట్లకు మాత్రమే హాజరయ్యే రాజమౌళి.. తన స్టైల్‌లో మాట్లాడి ముగించేస్తారు. అలాంటి రాజమౌళి డాన్స్ చేసిన దాఖలు ఇప్పటివరకు లేవు. అయితే తాజాగా రాజమౌళి స్టేజ్‌పై స్టెప్పులు వేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తాజాగా ఎస్ఎస్ రాజమౌళి ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌కు తన భార్య రమతో కలిసి వెళ్లారు. ఆ ఫంక్షన్‌లో ప్రేమికుడు సినిమాలోని ‘అందమైన ప్రేమరాణి ఉత్తరాలకే…’ అనే పాటకు రాజమౌళి దంపతులు డ్యాన్స్ చేశారు. రాజమౌళి, రమ స్టేజ్‌పై ఎంతో హుషారుగా డ్యాన్స్ చేశారు. ముఖ్యంగా జక్కన్న స్టెప్పులేసిన తీరు చూస్తే.. ఆశ్చర్యం కలగక మానదు. రాజమౌళి, రమ డాన్స్ చేస్తుంటే.. అందరూ ఈలలు, కేకలు వేశారు. ఈ డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది.
Also Read: Rishabh Pant Six: దీనికోసమే ఏడాదిన్నర వేచి చూశా: రిషబ్ పంత్
ఆర్ఆర్ఆర్‌తో భారీ హిట్ అందుకున్న ఎస్ఎస్ రాజమౌళి.. కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఓ సినిమా (SSMB29) చేస్తున్నారు. ఈ సినిమా స్క్రిప్టు పనుల్లో జక్కన్న మునిగిపోయారు. ఇటీవలే స్క్రిప్ట్ పూర్తి కాగా.. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు ఈ మూవీ కోసం లుక్ మార్చుకునే పనిలో ఉన్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ మూవీ సెట్స్ మీదికి వెళ్లే అవకాశం ఉంది.
Director #SSRajamouli and his wife #RamaRajamouli groove to the beats of Beautiful melody, setting the party on fire at a family function 🤩 pic.twitter.com/qlA3UYBpz2
— BhaRGV (@BhargavChaganti) April 1, 2024