Rishabh Pant React on One Handed Six in IPL 2024: ఓ మంచి ఇన్నింగ్స్ కోసం దాదాపు ఏడాదిన్నర పాటు వేచి చూశా అని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తెలిపాడు. ఏడాదిన్నర ఆటకు దూరమైనా ఆత్మవిశ్వాసం ఎప్పుడూ కోల్పేలేదని చెప్పాడు. ఒక క్రికెటర్‌గా తాను 100 శాతం ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు. ఇప్పటికీ క్రికెటర్‌గా నేర్చుకుంటూనే ఉన్నా అని పంత్ చెప్పుకొచ్చాడు. ఆదివారం విశాఖలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్ 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 51 రన్స్ చేశాడు.
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ బౌలింగ్‌లో రిషబ్ పంత్ ఒంటి చేత్తో బాదిన సిక్స్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఒంటి చేత్తో సిక్స్ కొట్టడంతో.. మునుపటి పంత్‌ను అతడు గుర్తుకు తెచ్చాడు. మ్యాచ్ అనంతరం ఇదే విషయంపై పంత్ స్పందించాడు. ‘గత ఏడాదిన్నరగా నేను పెద్దగా క్రికెట్ ఆడలేదు. దాంతో ఆరంభంలో కాస్త సమయం తీసుకున్నా. ఆత్మవిశ్వాసం ఎప్పుడూ కోల్పోలేదు. తప్పకుండా మంచి ఇన్నింగ్స్ ఆడుతానని భావించా. ఒంటి చేత్తో సిక్స్ కొట్టడం బాగా అనిపించింది. ఇలాంటి ఆట కోసం దాదాపు ఏడాదిన్నరపాటు వేచి చూశా. ఇప్పటికీ క్రికెటర్‌గా నేర్చుకుంటూనే ఉన్నా. ఓ క్రికెటర్‌గా 100 శాతం ప్రదర్శన ఇవ్వాలి’ పంత్ తెలిపాడు.
Also Read: Rishabh Pant Batting: ఒంటి చేత్తో సిక్స్.. ఒకప్పటిలా రిషబ్ పంత్ బ్యాటింగ్!
మ్యాచ్ గురించి రిషబ్ పంత్ మాట్లాడుతూ… ‘చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో మా బౌలర్లు అద్భుతం చేశారు. బాగా బౌలింగ్ చేశారు. గత మ్యాచ్‌లలో చేసిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకున్నాము. పృథ్వీ షా గత రెండు వారాల నుండి కష్టపడుతున్నాడు. అందుకే అతడికి అవకాశం ఇచ్చాం. బాగా ఆడాడు. ముకేశ్ కుమార్ కీలక సమయాల్లో వికెట్లు తీశాడు. పరిస్థితులను బట్టి అతడితో బౌలింగ్ వేయించాలనుకున్నాం. డెత్ ఓవర్లలో అతడు అద్భుతంగా బంతులు సంధించాడు. ఈ మ్యాచ్‌లో మేం పుంజుకున్న తీరు బాగుంది’ అని రిషబ్ పంత్ చెప్పాడు.