Spirit : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒకటి మారుతి దర్శకత్వంలో రాజాసాబ్. ఈ సినిమా తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల షూటింగ్స్ ఒకే సమయంలో జరుగుతున్నాయి. రాజాసాబ్ సినిమాను వచ్చే ఏడాది జనవరి వరకు పూర్తి చేయాలని ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడు. దాంతో పాటే ఫౌజీ సినిమాను వచ్చే ఏడాది వేసవి కల్లా పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ రెండు సినిమాల షూటింగులు దగ్గర పడిన తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో డార్లింగ్ స్పిరిట్ సినిమా ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే ఛాన్సులు ఉన్నాయి.
Read Also:Lack Of Sleep : సరిగ్గా నిద్ర పోకపోతే.. శరీరంలో జరిగే మార్పులు ఇవే..
సందీప్ రెడ్డి వంగా గత చిత్రాలు అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా రణబీర్ తో ఆయన తెరకెక్కించిన యానిమల్ సినిమా దాదాపుగా రూ.1000 కోట్లు వసూలు సాధించింది. దాంతో స్పిరిట్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు సందీప్.. సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేశాడట. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. స్పిరిట్‌లో చాలా స్పెషల్‌గా ఒక ఐటెం సాంగ్ కూడా ఉండబోతుందట. ఆ పాట కోసం ఇప్పటికే హర్షవర్ధన్ రామేశ్వర్ ట్యూన్‌ని రెడీ చేశాడట.
Read Also:Actress Shobhita : నటి శోభిత ఆత్మహత్యకేసులో కీలక మలుపు
ఆ స్పెషల్ సాంగ్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్, సౌత్‌లోనూ మంచి గుర్తింపు ఉన్న హీరోయిన్ కియారా అద్వానీ చేయబోతుందని టాక్. స్పిరిట్‌లో హీరోయిన్ ఎవరనే విషయమై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఇప్పటికే సినిమాలో ఐటెం సాంగ్‌ను కియారాతో చేయించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం అనే విషయం తేలాల్సి ఉంది. కానీ కియారా అద్వానీ వంటి స్టార్‌తో ఐటెం సాంగ్ చేయిస్తే కచ్చితంగా పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సందీప్ రెడ్డి సినిమా అంటేనే చాలా వైల్డ్‌గా సన్నివేశాలు ఉంటాయని తెలిసిందే. యానిమల్ సినిమాలోనే హింస ఎక్కువ అయ్యిందని విమర్శలు వచ్చినా.. వసూళ్లు మాత్రం అదే స్థాయిలో వచ్చాయి. సినిమాను భారీ ఎత్తున వైల్డ్ యాక్షన్ సీన్స్‌తో చేయాలని దర్శకుడు సందీప్ వంగ భావిస్తున్నాడు. ప్రభాస్‌ను వైల్డ్‌గా చూపిస్తే ప్రేక్షకులు ఎంత వరకు ఆదరిస్తారనేది చూడాలి.