ప్రపంచంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. చాలా మందికి తగినంత నిద్ర ఉండటం లేదు.

మొబైల్, టీవీ చూడటం ద్వారా రాత్రి ఆలస్యంగా పడుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే లేస్తే.. నిద్రలేమికి దారి తీస్తుంది. 

 నిపుణుల సలహా ప్రకారం రోజుకు 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. కానీ మనం మాత్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. 

 ప్రపంచంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. చాలా మందికి తగినంత నిద్ర ఉండటం లేదు.

 నిద్ర లేకపోవడం జ్ఞాపకశక్తి మీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. 

తగినంత నిద్ర లేకపోవడం వల్ల మన జ్ఞాపకశక్తికి సంబంధించిన మెదడులోని హిప్పోకాంపస్‌లోని న్యూరాన్‌లు డిస్‌కనెక్ట్ అవుతాయి.  

నిద్ర లేకపోవడం మానసిక కల్లోలం కలిగిస్తుంది. ఆందోళన, నిరాశ కూడా వస్తుంది. 

డిప్రెషన్‌తో బాధపడుతున్న వారిలో 65-90 శాతం మందికి నిద్ర సమస్యలు ఉన్నాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. 

సరైన నిద్ర లేకపోవడం మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. డిప్రెషన్ కూడా నిద్రలేమి ద్వారానే వస్తుంది.

 రోజుకు ఐదు గంటల కంటే తక్కువ నిద్రపోతే అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. రోగనిరోధక వ్యవస్థ తగ్గిపోతుంది. 

   అధిక బరువు కూడా పెరుగుతారు. మీ పొట్ట నిండుగా ఉందని మీ మెదడుకు సూచించే రసాయనం సరిగా పనిచేయదు.