శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ సెంచరీ మిస్ అయినప్పటికీ.. అతను అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. గిల్ 92 బంతుల్లో 92 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. శుభ్‌మన్ గిల్ క్రీజులో నుంచి ముందుకొచ్చి ఆఫ్ సైడ్ అద్భుత షాట్ ఆడాడు. అది చూసి నాన్-స్ట్రైక్‌లో ఉన్న విరాట్ కోహ్లీ ఆశ్చర్యపోయాడు.