న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ విజయంలో తన వంతు సహకారం అందించడం చాలా సంతోషంగా ఉందని టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చెప్పాడు. లక్ష్య ఛేదనలో పరుగులు చేయడమే కాదు, మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడటమే అత్యంత ముఖ్యమని అన్నాడు. గతం గురించి ఆలోచించకుండా, భవిష్యత్తు టెన్షన్‌కు పోకుండా.. ప్రస్తుతంపై పూర్తిగా దృష్టి పెడుతా అని గిల్ తెలిపాడు. ప్రస్తుతం గురించి ఆలోచించినపుడే విజయాల ఆనందాన్ని, అపజయాల నిరాశను సమతూకంగా ఎదుర్కొనగలమని గిల్ తెలిపాడు.…
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వడోదరలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే ఆరంభం అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత ప్లేయింగ్ 11లోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. పొట్టలో గాయం కారణంగా కొన్ని నెలలుగా శ్రేయస్ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఆకట్టుకోవడంతో అతడు జట్టులోకి వచ్చాడు. గాయం నుంచి కోలుకుని వచ్చిన శ్రేయస్‌కు ఈ సిరీస్ ఎంతో కీలకం…
Tilak Varma Out From IND vs NZ T20 Series Due to Injury: భారత క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తెలుగు ఆటగాడు, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే ఈ విషయాన్ని బీసీసీఐ ఇంకా ద్రువీకరించాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం.. గాయం కారణంగా తిలక్ వర్మ పొట్టి సిరీస్‌లో పాల్గొనలేకపోతున్నాడు. భారత్, న్యూజిలాండ్ టీ20 సిరీస్ జనవరి 21…
త్వరలో న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారత జట్టును ప్రకటించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టును ఈరోజు అధికారికంగా ప్రకటించింది. వన్డే సిరీస్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్ కాగా.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు బీసీసీఐ అవకాశం ఇచ్చింది. న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ ఎంపికైనా.. బీసీసీఐ సెంటర్…
న్యూజిలాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు టీమిండియా ఎంపికపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. సీనియర్, యువకులతో టీమ్ సమతుల్యంగా ఉండేలా బీసీసీఐ సెలెక్టర్లు జట్టును సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మూడు వన్డేల సిరీస్‌కు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శుక్రవారమే జట్టును ఎంపిక చేయాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో ఈరోజటికి వాయిదా పడింది. కెప్టెన్సీ బాధ్యతలు యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు అప్పగించే అవకాశం ఉండటం ఈ సిరీస్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. బ్యాటింగ్ విభాగంలో రోహిత్…
లక్నోలోని ఎకానా స్టేడియంలో మరికొద్దిసేపట్లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య నాలుగో టీ20 మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా వైస్ కెప్టెన్, ఓపెనర్ శుభ్‌మన్ గిల్ నాలుగో టీ20కి దూరమయ్యాడు. కాలి గాయంతో నాలుగో టీ20కి దూరమయ్యాడు. ఐదవ టీ20కి కూడా అందుబాటులో ఉండడని తెలుస్తోంది. నాలుగో టీ20లో గిల్ స్థానంలో సంజూ శాంసన్ ఓపెనర్‌గా ఆడనున్నాడు. టీ20 సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ పేలవ ప్రదర్శన చేస్తున్న విషయం…
Shubman Gill Dropped: టీ20 జట్టులో శుభ్‌మన్ గిల్ స్థానం గురించి మాజీ భారత క్రికెటర్ మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మిగతా మ్యాచ్‌లకు గిల్‌ను జట్టు నుంచి తప్పించాలని సూచించారు.
Suryakumar Yadav: భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. టీ20 ఫార్మాట్లో అతడి బ్యాటింగ్ ఫామ్ క్షీణించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
భారత టీ20 జట్టుకు శుభ్‌మాన్ గిల్ వైస్ కెప్టెన్‌గా నియమితులైనప్పటి నుంచి ఓపెనర్‌గా ఆడుతున్నాడు. గిల్ రాకతో ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ, సంజు శాంసన్ విడిపోయింది. అంతేకాకుండా సంజుకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కకుండా పోతోంది. దక్షిణాఫ్రికాతో కటక్‌లో జరిగిన తొలి టీ20కి సంజు దూరమయ్యాడు. న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్‌లో ఈరోజు జరిగే రెండో టీ20 మ్యాచ్‌లో కూడా అతడికి చోటు దక్కే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో గిల్, సంజు ఫామ్ చర్చనీయాంశంగా మారింది.…