దాడి ఘటనపై అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. తమ ఇంటి వద్ద జరిగిన ఘటన అందరూ చూశారని.. తమ ఇంటికి జూబ్లీహిల్స్ పోలీసులు వచ్చారన్నారు. వారిపై కేసు పెట్టారని చెప్పారు. ఇంటి దగ్గరికి ఎవరైనా గొడవ చేయడానికి వస్తే.. పోలీసులు వాళ్ళను తీసుకెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
ఈ-కార్ రేసు వ్యవహారంలో ఎక్కడా అవినీతి జరగలేదని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి అక్రమంగా బనాయించిన కేసులో హై కోర్టు కేటీఆర్ను అరెస్టు చేయొద్దు అని చెప్పిందని హరీష్ రావు తెలిపారు. ఇది డొల్ల కేసు అని మొదట్లోనే తేలిపోయిందని హరీష్ రావు అన్నారు.
భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ గ్రౌండ్‌లో చిరుతపులిలా పరుగెత్తడం చూస్తూ ఉంటాం. ఫీల్డింగ్ అయినా, వికెట్ల మధ్య అయినా వేగంగా పరుగులు తీస్తాడు. అయితే ఈరోజు చివరి టెస్టులో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లీ జోరుకు బ్రేక్ పడినట్లుగా అనిపించింది. ఎందుకంటే.. వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తే కోహ్లీ.. రనౌట్ అయ్యాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో డైవింగ్ చేసినా వికెట్ కాపాడుకోలేకపోయాడు.
లుకౌట్ నోటీసులపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. విదేశాల నుంచి వస్తుంటే ఏపీ పోలీసులు లుక్ ఔట్ నోటీసులు ఇచ్చారని అసత్య ప్రచారం చేస్తున్నారు.. తప్పు చేసి నేను తప్పించుకునే ప్రయత్నం చేశారని పైత్యంతో వార్తలు రాస్తున్నారని సజ్జల ఆరోపించారు.
పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలో పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపులపై ఎలాంటి ఆదేశాలు వచ్చినా.. కాంగ్రెస్ ప్రభుత్వానికే మంచిదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామంటేనే ఈ ఫిరాయింపులు మొదలయ్యాయని తెలిపారు.
తెలంగాణలో తప్పకుండా 10 స్థానాలకు పైగా లోక్‌సభ స్థానాలు గెలవబోతున్నామని మల్కాజ్‌గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఈటల మీడియాతో మాట్లాడారు.
ప్రధాని మోడీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. రెండుచోట్ల నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొ్న్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమి మద్ధతుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీకి వచ్చారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాగా.. ప్రధాని మోడీ వ్యాఖ్యలపై వైసీపీ రియాక్షన్ ఇచ్చింది. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై మోడీ, చంద్రబాబు వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు…
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత అవినీతికి పాల్పడినందుకు ఆమె జైలుకు వెళ్లాల్సిందేనని తెలిపారు. తప్పు చేస్తే ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందేనని... ఈ రోజు సోదరి వెళ్లింది... రేపు సోదరుడు వెళ్ళవచ్చు... ఎల్లుండి తండ్రి కూడా జైలుకు వెళ్లవచ్చునని కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలను ఆయన ఓ వీడియో ద్వారా తెలిపారు.
విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీ అభ్యర్థిత్వంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఝాన్సీ పోటీ విషయం ప్రస్తుతానికి అప్రస్తుతం అని అన్నారు. తనకు ఎటువంటి సమాచారం లేదు.. అధిష్టానం ఆలోచనల ఆధారంగా నిర్ణయం ఉంటుందని మంత్రి బొత్స తెలిపారు.