Watermelon: వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి పుచ్చకాయ (Watermelon) ఒక ఉత్తమమైన పండు. ఇందులో నీటి శాతం అధికంగా ఉండటంతో పాటు, అనేక పోషకాలు కూడా లభిస్తాయి. అయితే, చాలా మందికి పుచ్చకాయను డైరెక్ట్‌గా తినడం మంచిదా లేదా జ్యూస్ చేసుకొని తాగడం ఆరోగ్యానికి ఉత్తమమా? అనే సందేహం ఉంటుంది. ఈ రెండింటికి ఉన్న ప్రయోజనాలు, పరిమితుల గురించి చూద్దాం.
Read Also: World Happiness Countries: ఎనిమిదోసారి టాప్ ప్లేస్ లో ఫిన్‌లాండ్.. మరి భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే
పుచ్చకాయను డైరెక్ట్‌గా తినడం ప్రయోజనాలు:
పూర్తి ఫైబర్ పొందవచ్చు:
పుచ్చకాయను ముక్కలుగా తినడం వల్ల అందులోని ఫైబర్ (Fiber) శరీరానికి పూర్తిగా అందుతుంది. ఇది జీర్ణక్రియకు మంచిది. అలాగే కడుపు సంబంధిత సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది.
నెమ్మదిగా గ్లూకోజ్ విడుదల:
పుచ్చకాయలో సహజసిద్ధమైన చక్కెర (Natural Sugar) ఉంటుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (Glycemic Index) ఉన్నప్పటికీ, పుచ్చకాయను ముక్కలుగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరగకుండా సమతుల్యం అవుతాయి.
దీర్ఘకాలిక తృప్తి:
పుచ్చకాయను తినడం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయదు. ఎందుకంటే ఇందులో ఉండే ఫైబర్ ఆహారాన్ని జీర్ణం అయ్యే ప్రక్రియను నెమ్మదిస్తుంది.
విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు:
పుచ్చకాయను కట్ చేసి తింటే విటమిన్ A, C, యాంటీ ఆక్సిడెంట్లు పూర్తిగా శరీరానికి అందుతాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు, రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడతాయి.
Read Also: IPL 2025: ఆర్సీబీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ సంచలనం..
పుచ్చకాయ జ్యూస్ తాగడం ప్రయోజనాలు..
తేలికగా జీర్ణమవుతుంది:
కొన్ని మందికి పుచ్చకాయ ముక్కలు తినడం కష్టంగా అనిపించవచ్చు. అలాంటివారికి జ్యూస్ తాగడం సులభంగా ఉంటుంది.
తక్షణ శక్తి:
శరీరానికి తక్షణ శక్తి (Instant Energy) అవసరమైనప్పుడు, పుచ్చకాయ జ్యూస్ శరీరానికి త్వరగా గ్రహించబడుతుంది. ముఖ్యంగా జిమ్ చేస్తున్నవారు, ఎక్సర్సైజ్ తర్వాత దీన్ని తాగితే మంచిది.
నీటి శాతం ఎక్కువగా:
వేసవి కాలంలో డీహైడ్రేషన్‌ను నివారించడానికి పుచ్చకాయ జ్యూస్ మంచి ఎంపిక. దీనివల్ల శరీరం చల్లబడటమే కాకుండా, శరీరంలోని నీటి స్థాయిలు సరిగ్గా ఉంటాయి.
ఏది మంచిది?
ఆరోగ్య పరంగా చూస్తే, పుచ్చకాయను ముక్కలుగా తినడం ఉత్తమం. జ్యూస్ తాగాలనుకుంటే, ఎలాంటి చక్కెర (Sugar) లేదా కృత్రిమ రుచులను కలపకుండా తాగాలి. జ్యూస్ చేసేటప్పుడు పుచ్చకాయలోని ఫైబర్ పూర్తిగా పోతుంది. అందువల్ల పూర్తిగా పోషకాల కోసం పుచ్చకాయను తినే ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.