World Happiness Countries: ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవిత సంతృప్తిని అంచనా వేసే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025 ప్రకారం, ఫిన్‌లాండ్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది. ఇలా వరుసగా ఎనిమిదవ ఏడాది నిలిచింది. ఈ నివేదికను ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన వెల్‌బీయింగ్ రీసెర్చ్ సెంటర్ ప్రచురించింది. 2025లో టాప్ 10 అత్యంత ఆనందకర దేశాలుగా ఫిన్‌లాండ్, డెన్మార్క్, ఐస్‌లాండ్, స్వీడన్, నెదర్లాండ్స్, కొస్టారికా, నార్వే, ఇజ్రాయెల్, లక్సంబర్గ్, మెక్సికో దేశాలు నిలిచాయి.
Read Also: IPL 2025: ఆర్సీబీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ సంచలనం..
ఈ ర్యాంకింగ్స్ ప్రజల జీవిత మనుగడ ఆధారంగా నిర్ణయించబడతాయి. గ్యాలప్ సంస్థ UN సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్స్ నెట్‌వర్క్ తో కలిసి నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదిక రూపొందించబడింది. ఇక ఈ లిస్ట్ లో ఈసారి భారతదేశం 118వ స్థానంలో నిలిచింది. అయితే, పాకిస్తాన్ 109వ ర్యాంక్ ను దక్కించుకుంది. గణనీయమైన ఆర్థిక, సామాజిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ పాకిస్తాన్ ప్రజలు తమలోని సామాజిక మద్దతు వ్యవస్థను బలంగా అభివృద్ధి చేసుకున్నట్లు నివేదిక చెబుతోంది. 2025లో అమెరికా 24వ స్థానంలో నిలిచింది. 2012లో 11వ స్థానంలో ఉండగా 13 స్థానాలను కోల్పోయింది.
Read Also: IPL 2025: ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆ జట్టుకు భారీ షాక్..
ప్రపంచంలోనే అతి దుఃఖిత దేశంగా ఆఫ్ఘనిస్తాన్ నిలిచింది. ఇప్పటికే గత నాలుగు సంవత్సరాలుగా, ఆఫ్ఘనిస్తాన్(147వ ర్యాంక్) ప్రపంచంలోనే అతి బాధాకరమైన దేశంగా కొనసాగుతోంది. ముఖ్యంగా ఆఫ్ఘన్ మహిళలు తీవ్రమైన జీవన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని నివేదికలో వెల్లడైంది. సియేర్రా లియోన్ (146), లెబనాన్ (145), మలావి (144), జింబాబ్వే (143) దేశాలు చివరి స్థానాలలో నిలిచాయి.