Cattle Smuggling: పశువుల అక్రమ రవాణా కేసులో అంతరాష్ట్ర ముఠా ఆటకట్టించారు పోలీసులు. రాత్రి రాత్రే మత్తు ఇంజక్షన్లు ఇచ్చి ఎత్తుకెళ్లే ముఠా పోలీసులకు చిక్కింది. తెలంగాణలో చోరీ చేసి మహరాష్ట్రలో మాంసంగా విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. కానీ, ఈ అంతర్రాష్ట్ర ముఠా ఆగడాలకు చెక్ పెట్టారు నిర్మల్ పోలీసులు. ఈ ముఠా నాయకుడు నాందేడ్‌కు చెందిన సయ్యద్ సోహెల్. ఇతను దాదాపు 40 మందితో ముఠా ఏర్పాటు చేశాడు. అర్థరాత్రి రోడ్ల మీద ఉండే ఆవులు, ఎద్దులే…
Tamil Nadu: తమిళనాడు రాష్ట్రంలో ‘‘గబ్బిలాల’’ వేట కలకలం రేపుతోంది. గబ్బిలాలను చంపి, వాటిని సమీపంలో హోటల్స్‌లో చిల్లీ చికెన్‌లా తయారు చేస్తున్న ముఠా పట్టుబడింది. సేలం జిల్లా డేనిష్ పేటలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. డానిష్ పేటలోని అటవీ ప్రాంతంలో తుపాకులతో గబ్బిలాలను వేటాడుతున్న సెల్వం, కమల్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. Read Also: CIBIL Score: గూగుల్ పేలో ఒక్క క్లిక్‌తో సిబిల్ స్కోర్.. ఇలా చెక్ చేసుకోండి…
Harassing On Horse: పెళ్లి ఊరేగింపులో కొందరు యువకులు గుర్రంపై దారుణంగా ప్రవర్తించిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఊరేగింపులో గుర్రాన్ని బలవంతంగా నేలపై పడుకోబెట్టి సిగరెట్ తాగించడం, దానిపై పుష్-అప్స్ చేస్తూ వికృత చేష్టలకు పాల్పడడం వంటి చర్యలు ప్రజల ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ‘ఇట్స్ జీన్వాల్ షాబ్’ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేసిన వీడియోలో, ఒక వ్యక్తి బూట్లతో గుర్రంపై ఎక్కి దాని శరీరంపై పుష్-అప్స్ చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. పెళ్లి వేడుకలో…
మనుషుల్లో పెరుగుతున్న పైశాచికత్వానికి పరాకాష్ఠగా నిలిచిన ఘటన జవహర్ నగర్ లో చోటుచేసుకుంది. వీధికుక్కలపై కర్రలతో దాడి చేసిన దుండగులు వాటిని చిత్ర హింసలకు గురిచేసి చంపారు.