టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘శాకుంతలం’ కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అయితే.. ఈ సినిమాలో అందాల భామ సమంత లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి వరుస అప్డేట్స్ ఇస్తూ చిత్ర యూనిట్ సందడి చేస్తోంది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్, ‘మల్లికా మల్లికా’ సాంగ్ రిలీజ్ చేసి ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ తెలుగు చిత్రం ముందుగా నవంబర్ 4, 2022న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండే.. కానీ ఆలస్యంగా 3డీ ఫార్మాట్లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అయితే.. తాజా అప్డేట్ ఏమిటంటే, సినిమా OTT హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సర్వీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం.
Also Read : Top Headlines @9AM : టాప్‌న్యూస్
అయితే, మేకర్స్ నుండి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. శాకుంతలం చిత్రంలో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, అదితి బాలన్, గౌతమి, అనన్య నాగళ్ల, అల్లు అర్హ మరియు కబీర్ దుహన్ సింగ్ కీలక పాత్రలు పోషించారు. గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో 2డి, 3డి ఫార్మాట్లలో విడుదల కానుంది. కాళిదాసు రచించిన సంస్కృత నాటకం “అభిజ్ఞాన శాకుంతలం” ఆధారంగా, ఈ చిత్రానికి తెరకెక్కిస్తున్నారు. విచిత్రమైన కథగా పేర్కొనబడిన “శాకుంతలం” శకుంతల మరియు రాజు దుష్యంత్‌ల పురాణ ప్రేమకథ చుట్టూ తిరుగుతుంది.
Also Read : Telangana Congress: మూడోరోజు థాక్రే పర్యటన.. ఇవాళ్టి షెడ్యూల్ ఇదే..