నేడు ఏపీలో కానిస్టేబుల్ ప్రాథమిక వ్రాత పరీక్ష
ఆంధ్రప్రదేశ్ అంతటా నేడు నిర్వహించే ప్రిలిమినరీ రాత పరీక్షకు ఐదు లక్షల మందికి పైగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ ఆశావహులు హాజరయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ 35 నగరాలు మరియు పట్టణాలలోని 997 కేంద్రాలలో మూడు గంటల పరీక్షను నిర్వహించబోతోంది. రాష్ట్రంలో ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, ఒక్క నిమిషం ఆలస్యమైనా ఏ అభ్యర్థిని పరీక్ష హాలులోకి అనుమతించబోమని ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ చైర్మన్ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. పరీక్ష నిర్వాహణకు అన్ని ఏర్పాట్లు సజావుగా సాగుతున్నాయని చెప్పారు. అభ్యర్థులు ఉదయం 9 గంటల నుంచి పరీక్ష హాలులోకి అనుమతించబడతారని, ఎలక్ట్రానిక్ పరికరాలు, గాడ్జెట్‌లను అనుమతించరు.
మొత్తం 5.03 లక్షల మంది అభ్యర్థులు 6,100 స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 13,961 మంది పోస్ట్-గ్రాడ్యుయేషన్, 1,55,537 మంది గ్రాడ్యుయేషన్ కలిగి ఉన్నారు. అలాగే, 10 మంది అభ్యర్థులు పీహెచ్‌డీలు కలిగి ఉన్నారు. పోస్టుకు అవసరమైన విద్యార్హత ఇంటర్మీడియట్ లేదా తత్సమానం. ఏపీఎస్‌ఆర్టీసీ పరీక్షా కేంద్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతుంది. ట్రాఫిక్ జామ్‌లు లేకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రిలిమినరీ పరీక్ష తర్వాత, అభ్యర్థులు ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), మెడికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (MST), ఫైనల్ మెయిన్స్ ఎగ్జామ్, పర్సనల్ ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాలి.
నేడే ఏఈఈ రాతపరీక్ష.. అభ్యర్థులకు ముఖ్య సూచనలివే
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి నేడు రాత పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఏడు జిల్లాల్లోని 176 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష OMR విధానంలో మాత్రమే నిర్వహించబడుతుంది. పేపర్-1 పరీక్ష 22న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. పేపర్-1 పరీక్షకు ఉదయం 8.30 నుంచి 9.45 గంటల వరకు, పేపర్-2 పరీక్షకు మధ్యాహ్నం 1.15 నుంచి 2.15 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. గేట్లు మూసివేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశానికి అనుమతి లేదు. పేపర్-1 ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో.. పేపర్-2 ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది. ఇప్పటికే హాల్ టిక్కెట్లను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. పరీక్ష సమయానికి 45 నిమిషాల ముందు వరకు హాల్ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. మొత్తం 450 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్) 150 మార్కులు, పేపర్-2 (అభ్యర్థి సబ్జెక్ట్) 300 మార్కులు. పేపర్-1లో 150 మార్కులకు 150 ప్రశ్నలు, పేపర్-2లో 300 మార్కులకు 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 నిమిషాల పరీక్ష సమయం కేటాయించారు.
ఎర్రకోటపై ఖలిస్తాన్ జెండాను ఎగురవేస్తే 5లక్షల డాలర్లు ఇస్తా ఎస్‌ఎఫ్‌జే ప్రకటన
గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో ఉగ్రవాద దాడులకు పాల్పడతానంటూ సిక్కు ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే)కి చెందిన గురుపత్వంత్ సింగ్ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఎఫ్‌జే, గురుపత్‌వంత్‌సింగ్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. దేశమంతా జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకునేందుకు సిద్ధమవుతుండగా.. సిక్కు ఫర్ జస్టిస్ (ఎస్.ఎఫ్.జే) ఉగ్రవాద సంస్థ గురుపత్వంత్ సింగ్ విడుదల చేసిన వీడియో చర్చనీయాంశంగా మారింది. రిపబ్లిక్ డే రోజున ప్రత్యేక పంజాబ్ అనుకూల సంస్థ అయిన SFJ తీవ్రవాద దాడులకు పాల్పడుతుందనేది ఈ వీడియో సారాంశం. జనవరి 26న ఇంట్లోనే ఉండండి, లేదంటే భారీ మూల్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఢిల్లీ మా లక్ష్యం. అదే రోజు ఖలిస్తాన్ జెండాను ఆవిష్కరిస్తాం” అని గురుపత్వంత్ సింగ్ వీడియోలో తెలిపారు. ఎర్రకోటపై ఖలిస్తాన్ జెండాను ఎగురవేసిన వారికి 5 లక్షల డాలర్లు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. 2023లో భారత్ నుంచి పంజాబ్ ను వేరు చేస్తామని తెలిపాడు. ఈ నేపథ్యంలో వినీత్ జిందాల్ అనే న్యాయవాది గురుపత్వంత్ సింగ్‌పై ఎస్‌ఎఫ్‌జే సంస్థతో కలిసి సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేశారు. వీడియో చూసి షాక్ తిన్నానని, స్థానికంగా ఉంటూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం దారుణమని అన్నారు. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
బాబోయ్ బంగారం.. కొండ మీదే ఉన్న పసిడి
పసిడి, వెండి, ప్లాటినంతో సహా అలంకార లోహాల ధరలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. ఈ మార్పులు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక పరిణామాలపై ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో ధరలు మారుతూ ఉంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకార లోహాల రేట్లను పెంచడానికి లేదా తగ్గించడానికి అనేక అంశాలు పని చేస్తాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం అనేక ప్రాంతాలను ప్రభావితం చేసింది. ఆ ప్రభావంతో గత నెలరోజులుగా ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. అలాగే.. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంక్ వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు పెరగడం లేదా తగ్గడం, వివిధ ఆభరణాల మార్కెట్లలో వినియోగదారుల నుంచి డిమాండ్ హెచ్చుతగ్గులు వంటి అనేక అంశాలు ధరలను ప్రభావితం చేస్తాయి.
హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 52,250కి చేరుకుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 57,060. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర ₹ 74,300. ఏపీ, తెలంగాణ అంతటా ఇదే ధర అమల్లో ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర ₹ 52,250కి చేరుకుంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ₹ 57,060గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 74,300. విశాఖపట్నం మార్కెట్‌లో బంగారం మరియు వెండికి విజయవాడ మార్కెట్ రేటు అమలవుతోంది. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తుండటంతో బంగారం ధరలు మరింతగా పెరుగనున్నాయి. బంగారం ధరలు సామాన్యులకు కష్టాలు తప్పేట్లు లేవు. కొనుగోలు చేయాలనుకున్న బంగారంలో సగం మాత్రమే కొంటున్నారు. మరో వైపు కొనుగోల్ళు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. పెరుగుతున్న బంగారం ధరలు ఇప్పట్లో తగ్గవంటున్నారు గోల్డ్ అనలిస్ట్ లు. అయితే పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. కుటుంబ సభ్యులు బంగారం కొనాలంటేనే భయపడుతున్నారు. మరి ఇప్పట్లో బంగారం తగ్గేలా లేదు. పసిడి కొండెక్కడంతో బంగారం షాపులు ఎక్కడ చూసిన ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి.