Variety Wedding Card: ఈ కాలంలో చాలా మంది తమ పెళ్లిళ్లను జీవితాంతం గుర్తుండిపోయేలా వెరైటీగా ప్లాన్ చేసుకుంటున్నారు. చాలా మంది సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి వినూత్నంగా ఆలోచిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇలాంటి పెళ్లిళ్లు చాలానే జరుగుతున్నాయి. ఇటీవల వివాహం చేసుకునే యువతీ యువకులు తమ వివాహం పదికాలాలు గుర్తుండిపోయేలా చేసుకోవాలని తపనపడుతున్నారు. అందుకు రకరకాల విధానాలు అవలంభిస్తున్నారు. ఇక పెళ్లి అంటే ఆహ్వాన పత్రిక నుంచి విందు భోజనం వరకూ అన్నీ ప్రత్యేకంగా ఉండాల్సిందే. ఈ క్రమంలో ఓ యువకుడు వినూత్నంగా ఆలోచించాడు. తన పెళ్లికార్డును వెరైటీగా ముద్రించుకున్నాడు.
Also Read: KA Paul: తెలంగాణలో ప్రజాశాంతి పార్టీకి 80 సీట్లు.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
సిద్దిపేట జిల్లాకు చెందిన టీచర్ వెరైటీ పెళ్లి కార్డును క్రియేట్ చేశారు. ప్రశ్నాపత్రం తరహాలో శుభలేఖ ముద్రించారు ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనిల్. ఆబ్జెక్టివ్ పేపర్‌లా పెళ్లి కార్డుపై ప్రశ్నలు ఇచ్చి ఆప్షన్స్ పెట్టాడు పెళ్ళికొడుకు. పెళ్లి కార్డును ప్రశ్నల రూపంలో ఇచ్చి ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. అలాగే కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలంటే ట్రూ, ఫాల్స్‌తో ఆన్సర్ తెలిపే విధంగా కార్డ్ ప్రింట్ చేయించాడు. అనిల్ మొత్తానికి తన పెళ్లి కార్డ్‌ను ఓ ప్రశ్నాపత్రంగా మార్చేశాడు. అంతేకాకుండా వందకు వంద మార్కులు కూడా ఉంటాయన్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఈ కార్డు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో అది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అలాగే టెక్నాలజీ పెరిగే కొద్ది ఇంకా ఎలాంటి కార్డులు వస్తాయో అని చర్చించుకుంటున్నారు. ఉపాధ్యాయుడు అనిల్, అక్షరల వివాహం ఈ నెల 19న సిద్దిపేటలో జరగనుంది.