సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని తమ సొంతూళ్లకు వెళ్లేందుకు నగర వాసులు పయనమయ్యారు. దీంతో నగరంలో భారీ ట్రాఫిక్ రద్దీ
పెరిగింది. దీంతో నగరంలో ప్రధాన బస్టాండ్‌లు MGBS, JBS బస్టాండ్‌లతో పాటు వివిధ బస్టాండ్‌లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.
భారీగా ప్రయాణికుల రద్దీ ఉండటంతో ఆర్టీసీ సిబ్బంది కంట్రోల్ చేయలేకపోతున్నారు. అధిక రద్దీతో బస్సులు కదులుతున్నాయి.
ప్రమాదకరంగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.
బస్టాండ్‌కి బస్ వచ్చిన ఒక్క నిమిషంలోనే ఫుల్ అయిపోతున్నాయి బస్సులు. రద్దీని కంట్రోల్ చేసేందుకు సిటీ బస్సులను ఆర్టీసీ డైవర్ట్ చేస్తోంది. కొందరు మహిళలు రద్దీకి భయపడి ఉచితం వద్దంటూ డీలెక్స్ కోసం వేచి ఉన్నారు. గత ఏడాది కన్నా ఎక్కువ మంది ప్రయాణికులు ఆర్టీసీ ప్రయాణం చేస్తున్నారు… అందులో మహిళలే అధికంగా ఉండటం గమనార్హం.. ఇవాళ సాయంత్రానికి ఇంకా రద్దీ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు ఆర్టీసీ అధికారులు…
ఇదిలా ఉంటే.. హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ నెలకొంది. రద్దీని తగ్గించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నప్పటికీ
కార్లు, బస్సులు మరియు ఇతర రవాణా వాహనాలు టోల్ ప్లాజాల వద్ద క్యూ కట్టాయి. హైదరాబాద్ సమీపంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద
ప్రయాణికులతో వెళ్లే వాహనాలు ప్రత్యేకంగా భారీ రద్దీ కనిపించింది.
రద్దీ దృష్ట్యా అధికారులు 10 అదనపు గేట్లను తెరిచారు. ఫాస్ట్ ట్యాగ్ సదుపాయం వల్ల టోల్ ప్లాజా ద్వారా వాహనాలు సాఫీగా వెళ్లేందుకు
వీలు కలుగుతుందని అధికారులు తెలిపారు. టోల్ ప్లాజాలో ప్రతిరోజూ దాదాపు 38,000 వాహనాలు తిరుగుతుంటాయి. అయితే సంక్రాంతి
రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ సంఖ్య 70,000 వరకు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు అధికారులు.