Victory Venkatesh: వెంకటేష్‌కి వింత పరిస్థితి.. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రచారం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Victory Venkatesh to Campaign for BJP, Congress Candidates: ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఇక ఏపీలో ఎన్నికల నేపథ్యంలో పలువురు సినీ హీరోలు సైతం ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తనకు మామ వరుసయ్యే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాలకొండయ్య కోసం పాన్ ఇండియా హీరోగా మారిన నిఖిల్ సిద్ధార్థ్ ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక రేపు తన బాబాయి పవన్ కళ్యాణ్ కోసం వరుణ్ తేజ్ పిఠాపురం నుంచి ప్రచారం చేయబోతున్నారు. ఇక ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా ప్రచారానికి వెళ్లబోతున్నారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆయన తన బంధువులు ఇద్దరి కోసం ప్రచారం చేయబోతున్నారు.
Krishnamma : మే 10కి వాయిదా పడ్డ సత్యదేవ్ ‘కృష్ణమ్మ’
Also Read
వారు ఇద్దరూ రెండు భిన్నమైన పార్టీలలో ఉన్నారు. వెంకటేష్ వియ్యంకుడు ఖమ్మం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వెంకటేష్ పెద్ద కుమార్తె అశ్రితా మామ అక్కడ నుంచి పోటీ చేస్తూ ఉండడంతో వెంకటేష్ ఒకరోజు ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది. మరోపక్క కైకలూరులో తన భార్యకు సొంత మేనమామ అయిన కామినేని శ్రీనివాస్ కూటమి అభ్యర్థిగా బిజెపి తరఫున పోటీ చేస్తున్నారు. ఆయన కోసం మరో రోజు ప్రచారం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ పార్టీల తరపున కాకుండా ఆయన కేవలం అభ్యర్థుల తరఫున మాత్రమే ప్రచారం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఏదేమైనా కాంగ్రెస్, బీజేపీ ప్రధాన పార్టీలుగా పేరు తెచ్చుకున్నాయి. ఇక ఆయా పార్టీలకు ఆయన రెండు రోజులు రెండు ప్రచారాలు చేయబోతూ ఉండడం గమనార్హం.
తాజావార్తలు
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
-
Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..