సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ ఇప్పటికే హీరోయిన్ గా నిలదొక్కుకుని తన గ్లామర్ తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకోగా, అతని కొడుకు ఇబ్రహీం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నాడు. అనుకున్నట్టుగానే తొలిచిత్రం కరణ్ జోహార్ పర్యవేక్షణలో జరగనుంది. సీనియర్ నటుడు బొమన్ ఇరానీ కుమారుడు కయోజ్ ఇరానీ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాలో సీనియర్ స్టార్ నటి కాజోల్ దేవగన్, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఇబ్రహీంకు హీరోయిన్ ఎవరూ ఉండరని తెలుస్తోంది. సైఫ్ కార్బన్ కాపీలా కనిపించే ఇబ్రహీం ఎలా రాణిస్తాడనేది చాలా ఆసక్తికరంగా మారింది. సారా అలీ ఖాన్ ఇటీవల తన సోదరుడి తొలి చిత్రం నిర్మాణం పూర్తయిందని పేర్కొంది. ఈ ఏడాది చివర్లో సినిమా విడుదల కానుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘సారా జమీన్’ అనే టైటిల్‌ని మేకర్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Also Read : Devi Sri Prasad : మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ఆశీర్వాదం తీసుకున్న రాక్ స్టార్..
అయితే.. సైలీ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అరంగేట్రం చేస్తున్న ఈ సినిమా మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ హీరోగా నటించిన సినిమా ‘హృదయం’ రీమేక్ కావడం విశేషం. హృదయం సినిమా రూ. 6 కోట్లతో తీస్తే… సుమారు రూ. 55 కోట్లు వసూలు చేసింది. దర్శనా రాజేంద్రన్, కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి తెలుగునాట కూడా మంచి స్పందన లభించింది. కాలేజీ రోజుల నుంచి వైవాహిక బంధం వరకు ఓ యువకుడి భావోద్వేగభరిత జీవిత ప్రయాణానికి అందమైన దృశ్యరూపంగా నిలిచింది. హైదరాబాద్‌లో కొన్ని థియేటర్లలో సబ్ టైటిల్స్‌తో మలయాళంలో సినిమా విడుదలైంది. మలయాళీలతో పాటు తెలుగు ప్రేక్షకులు కొంత మంది సినిమా చూశారు.
Also Read : Blind Cricket: వరల్డ్ ఛాంపియన్‌గా పాక్.. ఫైనల్లో టీమిండియా ఓటమి