తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవబోతోంది అని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు 6 గ్యారంటీలు ఇచ్చాం.. బిల్లా-రంగాలు కాంగ్రెస్ ను తిట్టడమే పనిగా పెట్టుకుని ఉర్ల మీద పడ్డారు.. ప్రజల ఆశీర్వాదం ఎవరి వైపు ఉంటుందో.. తేలిపోనుంది.. పోలింగ్ అయిపోగానే పారిపోయేందుకు సిద్దం అవుతున్నారు.. కేసీఆర్ బంధువులు వేర్వేరు దేశాల్లో పాస్ పోర్టులు తీసుకున్నారు అని ఆయన ఆరోపించారు. కేసీఆర్ అవినీతిపై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విచారణ చేస్తాం.. టీఆర్ఎస్ అభ్యర్తులను ప్రకటించారు.. కానీ ప్రజలకు ఏం కావాలో ప్రకటించలేదు.. కాంగ్రెస్ కు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంది.. బీజేపీ పార్టీకి అభ్యర్థులు లేరు.. మేనిఫెస్టో లేదు అంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Putin: ఒక్క శత్రువు కూడా బతకడు.. పుతిన్ మాస్ వార్నింగ్..
మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బిల్లా, రంగాలు తిరుగుతున్నారు అంటూ కామెంట్స్ చేశారు. చిత్త కార్తె కుక్కల్లా తిరుగుతున్నారు.. ఎమ్మెల్యే కాకుండానే హరీశ్ రావును కాంగ్రెస్ మంత్రిని చేసింది.. రబ్బరు చెప్పులు వేసుకునే హరీశ్ రావును మంత్రిని చేసింది కాంగ్రెస్ అని ఆయన మండిపడ్డారు. మమ్మల్ని మరుగుజ్జులు అంటారా.. కేసీఆర్ ఏమన్నా బాహుబలి నా.. అద్దంలో ముఖం చూసుకోవాలి.. కాంగ్రెస్ లేకుంటే తెలంగాణ వచ్చేదా.. సిద్దిపేట, సిరిసిల్ల , గజ్వేల్ లో అమలు చేస్తున్న పథకాలు తెలంగాణలో అంతటా ఎందుకు అమలు చెయ్యరు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
Read Also: Supreme Court: రాష్ట్ర విధాన నిర్ణయంలో జోక్యం చేసుకోలేం.. బీహార్ ప్రభుత్వానికి నోటీసులు
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఎమ్మె్ల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వంశీ చందర్ రెడ్డిని అభిన్నదిస్తున్నా..జాతీయ స్థాయిలో తన పాత్ర వంశీ చందర్ రెడ్డి పోషిస్తున్నారు.. వంశీ చందర్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. స్థానికంగా అందుబాటులో ఉండలేని నాయకులు వంశీ చందర్ లా సరైన నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.