Putin: రష్యా తన కొత్త వ్యూహాత్మక క్షిపణిని విజయవంతంగా పరీక్షించిందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. 30 ఏళ్ల తరువాత తొలిసారిగి అణుసమార్థ్యం ఉన్న ఆయుధ పరీక్షను నిర్వహించింది రష్యా. అణుశక్తితో నడిచే, అణు సామర్థ్యం కలిగిన క్రూయిజ్ క్షిపణి అయిన ‘బ్యూరేవెస్ట్నిక్’ని విజయవంతంగా పరీక్షించిందని పుతిన్ చెప్పారు. రష్యా తన కొత్త తరం అణ్వాయుధాలలో కీలకమైన సర్మత్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థపై దాదాపుగా పనిని పూర్తి చేసిందని వెల్లడించారు.
గతేడాది ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో వెస్ట్రన్ దేశాలు ఉక్రెయిన్ కి సాయం చేయడంపై పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు అణు హెచ్చరికలు కూడా చేశారు. రష్యాపై బుద్ధి ఉన్నవారు ఎవరూ కూడా అణ్వాయుధాలను ప్రయోగించరని అన్నారు. ఒక వేళ అటువంటి దాడిని గుర్తిస్తే మన క్షిపణులు వందలు, వందలుగా గాల్లో కనిపిస్తాయి, ఒక్క శత్రువు కూడా మనుగడ సాధించే అవకాశం ఉందడని ఆయన హెచ్చరించారు.
Read Also: NewsClick FIR: భారత్‌లోకి అక్రమంగా విదేశీ నిధులు.. ఎఫ్‌ఐఆర్‌లో కీలక విషయాలు
1990లో సోవియట్ యూనియన్ పతనం తర్వాత రష్యా అణు పరీక్షలను నిర్వహించలేదు. అయితే ఇటువంటి పరీక్షలను రష్యా తిరిగి ప్రారంభించే అవకాశాన్ని పుతిన్ తోసిపుచ్చలేదు. అణు పరీక్షలను నిషేధించే ఒప్పందాన్ని అమెరికా ఆమోదించలేదని గుర్తు చేసిన పుతిన్.. రష్యా సంతకం చేసి ఆమోదించిందని, అయితే రష్యా పార్లమెంట్ తన ఆమోదాన్ని ఉపసంహరించుకుంటే సిద్ధాంతపరంగా అణుపరీక్ష సాధ్యమవుతుందని అన్నారు.
గత 60 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా మళ్లీ రష్యా, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇరు దేశాలు కూడా అణు పరీక్షల్ని ప్రారంభించడం తీవ్ర అస్థిరతకు దారి తీస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఫిబ్రవరిలో పుతిన్ NEW START (వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం) ఒప్పందం నుంచి తప్పుకుంది. ఇది అణ్వాయుధాల సంఖ్యను పరిమితం చేస్తుంది. అణుదాడికి ప్రతిస్పందనగా, దేశ ఉనికికి ముప్పు ఏర్పడినప్పుడు రష్యా అణుదాడి చేయవచ్చని పుతిన్ అన్నారు.