కామారెడ్డి రైతుల ఆందోళనపై సీఎం కేసీఆర్ కి రేవంత్ లేఖ రాశారు. కామారెడ్డి మునిసిపాలిటీ కొత్త మాస్టర్ ప్లాన్ ముసాయిదాను వెంటనే రద్దు చేసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కామారెడ్డిలో రైతులు చేస్తున్న ఆందోళనలకు కాంగ్రెస్ మద్దతు ప్రకటిస్తుందని, అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో పయ్యావుల రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమైన విషయన్నారు. మాస్టార్ ప్లాన్ లో రైతుల పొలాలను పారిశ్రామిక వాడల కింద గుర్తించడం వల్ల కొద్దిగా భూములు ఉన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు రేవంత్ రెడ్డి. ఈ విషయంలో మునిసిపల్, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
Also Read : Peddireddy Ramachandra Reddy: కుప్పంలో నీ బట్టలు ఊడగొడతాం… ఖబడ్దార్
గ్రామ సభలు పెట్టి రైతులతో చర్చించకుండా అధికారులు రైతుల అభిప్రాయం సేకరించకుండా ఎలా అమలు చేస్తారని, రైతులు తమ డిమాండ్ల సాధన కోసం ప్రాణ సమానమైన భూములను కాపాడుకునేందుకు కలెక్టర్ తో చర్చించేందుకు వస్తే కలెక్టర్ కనీసం రైతులతో మాట్లాడేందుకు నిరాకరించడం ప్రజల పట్ల ఈ పాలకులకు ఉన్న నియంత ధోరణికి పరాకాష్ట అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి వెంటనే స్పందించి రైతుల ఆందోళనలను విరమింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
Also Read : Madhu Yashki : బచ్చాగాళ్లతో మేము క్యారెక్టర్ రుజువు చేసుకోవాలని డిమాండ్ చేసే పరిస్థితి వచ్చింది
ఆత్మహత్య చేసుకున్న రాములు కుటుంబానికి కోటి రూపాయల పరిహారం అందించాలని రేవంత్ రెడ్డి కోరారు. రాములు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రైతుల ముందు పెట్టి ప్రజా సభ లలో చర్చించి ప్రజల మద్దతుతోనే అమలు చేయాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని, కలెక్టరేట్ల వద్ద జరిగిన రైతు, పోకిసులకు మధ్య ఘర్షణకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు రేవంత్ రెడ్డి.