మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఒక వార్డు మెంబర్ కూడా ఇలా దిగజారి మాట్లాడారు నువ్వు అలా మాట్లాడుతున్నావు. నన్ను పుడంగి అంటున్నాడు పుడంగికి అర్థం తెలుసా అని నేను అడుగుతున్నా అన్నారు. కుప్పంలో ఘోరంగా ఓడిపోయావు పుంగనూరుకు వచ్చి నన్ను ఏం చేస్తావ్? జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల,సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో మూడు చెరువుల నీళ్లు తాగించాం కదా. పుంగనూరులో ఏదో తేలుస్తా అంటున్నాడు,ఆయన కాదు వాళ్ళ తాతలు దిగొచ్చిన ఆయన తరం కాదు.
Read Also: Madhu Yashki : బచ్చాగాళ్లతో మేము క్యారెక్టర్ రుజువు చేసుకోవాలని డిమాండ్ చేసే పరిస్థితి వచ్చింది
ఆయన అనుకుని వుంటే నేను జిల్లాలో తిరేగేవాడిని కాదట. నీకంటే 14 సంవత్సరాలు ఆయన కంటే ముందే ఆధిక్యంలోనే నేను కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చా. 14 సంవత్సరాలు నువ్వు చేసేదేంటి నీకంటే నేనే ఎక్కువ చేశా. 14.సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక ఓటు మెజారిటీతో జిల్లా పరిషత్ సీటు కైవసం చేసుకున్నాను. జిల్లాలో నాకంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలు సాధించవచ్చు. కాలేజ్ రోజుల నుండి ఆయనకు జీవిత కాలం పట్టింది నాపై ఆధిక్యత సాధించేందుకు. ఇందిరమ్మ పేరుతో నువ్వు శాసనసభ్యుడు అయ్యావు.
రామారావు గారి కుమార్తెను పెళ్లి చేసుకొని కుప్పంలో ఉన్న అభ్యర్థిని రాజీనామా చేయించి కుప్పంలో గెలిచావు. మారావు అల్లుడు కాకపోయింటే నువ్వు శాసన సభ్యుడు అయ్యేవాడివా. నీకు రామారావు పేరు అండగా ఉంది కాబట్టి రాజకీయాల్లో రాగలిగావు. నువ్వు మాతో పోల్చుకునేది చాలా దురదృష్టకరం. 1993 నుంచి పాల వ్యాపారంలో వున్నాను. నీమాదిరిగా పార్టనర్స్ ను మోసం చేసి వేల కోట్లు సంపాదించలేదు.నేను దౌర్జన్యం చేసి పాలు తీసుకుంటుంటే ఇన్ని సంవత్సరాలు వ్యాపారం చేయగలిగేవాడినా.
Chandrababu Naidu: మంత్రి పెద్దిరెడ్డిపై చంద్రబాబు నిప్పులు
నువ్వు ముందు నుంచి హెరిటేజ్ డైరీ నడుపుతున్నావు. నీకు సిగ్గులేదా అబద్ధాలు చెప్పడానికి. జిల్లాలో అందరికి తెలుసు నీ బతుకు.నా బట్టలు ఊడదీస్తా అని మాట్లాడుతున్నావు, సిగ్గులేదా నీకు కుప్పంలో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నీ బట్టలు ఎప్పుడో ఊడిపోయాయి. కుప్పంలో తెల్లారిపోయింది నీ బతుకు. .2024లో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఫైనల్ గా కుప్పంలో నీ బట్టలు ఊడిపోతాయన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రెండు ఎకరాల నుంచి నువ్వు లక్షల కోట్లకు ఎలా ఎదిగావు. కాలేజీ రోజుల నుంచి నిన్ను ఎదిరిస్తున్నాను…మేము వదిలితేనే నువ్వు కుప్పంలో తిరుగుతున్నావు. లేకుంటే హైదరాబాదు నుంచి బయటకు రాలేవు…నిన్ను గాడిద కొడకా అని అంటే గాడిదలు మా ఇంటి దగ్గరకు వచ్చి ఆందోళన చేస్తాయి… ఇలాంటి బిడ్డను కన్నందుకు అవి సిగ్గు పడతాయి… కుప్పంలో నువ్వు ఎలా గెలుస్తావో చూస్తానన్నారు మంత్రి పెద్దిరెడ్డి.
Read Also: Prisoner Escape: టాయిలెట్ అర్జెంట్.. ఓకే వెళ్లు.. ఇంకేముంది సినిమా స్టైల్లో ట్రైన్ నుంచి జంప్