క్షేత్ర స్థాయిలో కీలక సేవలందిస్తూ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో పీహెచ్‌సీల వైద్యులు, ఆశాలు, ఏఎన్‌ఎంలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వ్యాధిని గుర్తించి, చికిత్స అందించడం ద్వారా ప్రజలు దీర్ఘకాలిక రోగాల బారిన పడకుండా కాపాడుతున్నారు. గత సంవత్సరం రికార్డు ప్రకారం.. మొత్తం ప్రసవాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే 76.3% డెలివరీలు జరగడం సరికొత్త రికార్డు. అయితే.. గర్భిణులను కంటికి రెప్పలా కాపాడుతూ, వారిపై రూపాయి భారం పడకుండా ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు జరిగేందుకు ఆశాలు, ఏఎన్‌ఎంలు చేస్తున్న కృషి గొప్పది. అయితే తాజాగా జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో ప్రసవాలు చేశారు వైద్యులు. జగిత్యాల జిల్లా ప్రభుత్వ మాత శిశు సంరక్షణ కేంద్రం ఆసుపత్రిలో రికార్డు స్థాయిలో 24 గంటల్లో 25 ప్రసవాలు చేశారు. ఈ నెల 15న జగిత్యాల మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో 25 ప్రసవాలు చేశారు డాక్టర్లు. వీటిలో.. 13 సాధారణ ప్రసవాలు, 12 సిజేరియన్ ప్రసవాలు చేశారు. అయితే.. దీనిపై వైద్యులకు ప్రశంసల వెల్లువెత్తాయి.
Annamaya District: గుప్త నిధుల కోసమా..? మరేదైనా కారణమా.. అభయాంజనేయ స్వామి ఆలయం కూల్చివేత
జగిత్యాల మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఏకకాలంలో జరిగిన ప్రసవాల్లో వైద్యులు, నర్సులు రికార్డు సృష్టించారు. జరిగిన ప్రసవాల్లో తల్లి బిడ్డల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సాధారణ ప్రసవాలు చేయడంలో నర్సుల తోడ్పాటు ఎంతో ఉందని బాలింతల కుటుంబ సభ్యులు కొనియాడారు. ప్రసవాలు చేసిన వైద్యులు, ఆసుపత్రి సిబ్బందికి సూపరింటెండెంట్ డాక్టర్ రాములు ప్రశంసలు జల్లు కురిపించారు.
DA Increase: దీపావళి సందర్భంగా ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్..