క్షేత్ర స్థాయిలో కీలక సేవలందిస్తూ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో పీహెచ్‌సీల వైద్యులు, ఆశాలు, ఏఎన్‌ఎంలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వ్యాధిని గుర్తించి, చికిత్స అందించడం ద్వారా ప్రజలు దీర్ఘకాలిక రోగాల బారిన పడకుండా కాపాడుతున్నారు. గత సంవత్సరం రికార్డు ప్రకారం.. మొత్తం ప్రసవాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే 76.3% డెలివరీలు జరగడం సరికొత్త రికార్డు. అయితే.. గర్భిణులను కంటికి రెప్పలా కాపాడుతూ, వారిపై రూపాయి భారం పడకుండా ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు జరిగేందుకు ఆశాలు, ఏఎన్‌ఎంలు చేస్తున్న కృషి గొప్పది.…