తెలుగు చిత్రపరిశ్రమకు సంక్రాంతి బాగా అచ్చివచ్చే సీజన్. ఆ టైమ్ లో స్టార్స్ నటించిన రెండు మూడు సినిమాలు విడుదలైనా ఆడియన్స్ ఆదరిస్తుంటారు. అందుకే మన స్టార్స్ సైతం తమ సినిమాలను సంక్రాంతికి వచ్చేలా ప్లాన్ చేసుకుంటుంటారు. తాజాగా మాస్ మహరాజా రవితేజ నటించే ‘ఈగల్’ మూవీ 2024 సంక్రాంతికి వస్తుందని మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రవితేజ సంక్రాంతి రిలీజెస్ అండ్ క్లాషెస్ పై ఓ లుక్కేద్దాం.
Also Read : Guntur Kaaram: సినిమాలో అదిరిపోయిన శ్రీలీల లుక్…!!
రవితేజ హీరోగా కెరీర్ ప్రారంభించి పాతికేళ్ళు పూర్తయ్యాయి. ఇప్పటివరకూ దాదాపు 70కి పైగా సినిమాలలో నటించాడు. నిజానికి రవితేజ సోలో హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్న తొలి రోజుల్లోనే 20 ఏళ్ళ క్రితం ‘ఈ అబ్బాయి చాలా మంచోడు’ 2003లో సంక్రాంతి కానుకగా విడుదలైంది. రవితేజకు అదే ఫస్ట్ సంక్రాంతి రిలీజ్. ‘కాదల్ కొట్టై’ ఫేమ్ అగస్త్యన్ ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా కమర్షియల్ గా ఘన విజయం సాధించక పోయినా నటుడిగా రవితేజకు మంచి మార్కులు సంపాదించిపెట్టింది. ఆ సీజన్ లో రవితేజ… మహేశ్ బాబు ‘ఒక్కడు’, జూనియర్ ఎన్టీయార్ ‘నాగ’, కె. ఎస్. రామారావు తనయుడు వల్లభ ‘ఎవరే అతగాడు’ సినిమాలతో పోటీ పడ్డాడు. అయితే మహేశ్ ‘ఒక్కడు’ బంపర్ హిట్ అయ్యి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.
Also Read : IT Raids In Hyderabad: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లలో ఐటీ అధికారుల సోదాలు
‘ఈ అబ్బాయి చాలామంచోడు’ తర్వాత ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, వెంకీ, భద్ర, విక్రమార్కుడు, దుబాయ్ శీను’ చిత్రాలతో రవితేజ సక్సెస్ ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి సమయంలో అతని సినిమా ‘కృష్ణ’ 2008లో సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఆ సీజన్ లో బాలకృష్ణ ‘ఒక్క మగాడు’, సుమంత్ ‘పౌరుడు’, ఎమ్మెస్ రాజు కన్నడ రీమేక్ ‘వాన’ సినిమాలతో ‘కృష్ణ’ పోటీ పడింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన రవిజతే ‘కృష్ణ’ విన్నర్ గా నిలిచింది. రవితేజ, త్రిష జంటగా వి.వి. వినాయక్ తెరకెక్కించిన ఈ సినిమా రవితేజ కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రంగా నిలిచింది. నిజానికి రీమేక్ చిత్రాలు చేయడానికి రవితేజ అంతగా ఆసక్తి చూపించడు. బట్ సినిమాటోగ్రాఫర్ గోపాల్ రెడ్డి దర్శకత్వంలో బెల్లంకొండ సురేశ్ నిర్మించిన ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’లో రవితేజ నటించాడు. ఎంతో ఇష్టంతో చేసిన ఆ సినిమా తెలుగులో మాత్రం పరాజయం పాలైంది. విచిత్రం ఏమిటంటే అదే బెల్లంకొండ సురేశ్ రవితేజతోనే తమిళ చిత్రం ‘నాడోడిగల్’ను తెలుగులో ‘శంభో శివ శంభో’ పేరుతో సముద్ర కని దర్శకత్వంలో రీమేక్ చేశాడు. రవితేజతో పాటు నరేశ్, శివబాలాజీ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా 2010 సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కినా కమర్షియల్ గా విజయం సాధించలేకపోయింది.
Also Read : Adipurush Movie: ‘ఆదిపురుష్’ బిజినెస్ విశేషాలు!
ఆ సీజన్ లో వెంకటేశ్ ‘నమో వెంకటేశ’, ఎన్టీ ఆర్ ‘అదుర్స్’ సినిమాలతో రవితేజ బాక్సాఫీస్ వద్ద పోటీ పడాల్సి వచ్చింది. ఎన్టీ ఆర్ `’అదుర్స్’ విజయం సాధించింది. ‘శంభో శివ శంభో’ తర్వాత వెంటనే సంక్రాంతికి రవితేజ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. హరీశ్ శంకర్ తెరకెక్కించిన ‘మిరపకాయ్’ తో పొంగల్ బరిలో దిగాడు. ఈసారి బాలకృష్ణ, సుమంత్ తో రెండోసారి రవితేజ పోటీ పడ్డాడు. బాలకృష్ణ ‘పరమవీరచక్ర’, సుమంత్ ‘గోల్కొండ హైస్కూల్’, సిద్దార్థ్ ‘అనగనగా ఒక ధీరుడు’ సినిమాలతో పోటీపడ్డా ‘మిరపకాయ్’దే పై చేయి అయ్యింది.
Also Read : Manipur Violence: మణిపూర్ లో కొనసాగుతున్న అల్లర్లు.. 10 మంది మృతి
ఆ తర్వాత దాదాపు తొమ్మిదేళ్ళ పాటు రవితేజ సంక్రాంతి సీజన్ కు దూరంగా న్నాడు. 2021లో రవితేజ ‘క్రాక్’తో మళ్ళీ సంక్రాంతి బరిలో దిగాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటించిన ‘క్రాక్’ తో పాటే రామ్ ‘రెడ్’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ చిత్రాలు సంక్రాంతి కానుకగా విడుదల అయ్యాయి. ఈసారి రవితేజదే అప్పర్ హ్యాండ్ అయ్యింది. శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించిన ‘క్రాక్’ దాదాపు 75 కోట్ల గ్రాస్ వసూలు చేసి, రవితేజ సినిమాలలో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఇక ఈ యేడాది సంక్రాంతి కానుకగా వచ్చిన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లో రవితేజ కీలక పాత్ర పోషించాడు. సినిమా ద్వితీయార్థం అంతా రవితేజ మీదనే సాగింది. ఈ సినిమాతో పాటే సంక్రాంతి బరిలో బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’, విజయ్ తమిళ డబ్బింగ్ సినిమా ‘వారసుడు’, సంతోష్ శోభన్ ‘కళ్యాణం కమనీయం’ చిత్రాలు వచ్చాయి. ఇందులో చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలు రెండూ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఆ రకంగా ఈ సంక్రాంతి కూడా రవితేజకు మెగా హిట్ ను అందించింది.
Also Read : Andhrapradesh: ఫేస్‌బుక్ ద్వారా పరిచయం.. డిగ్రీ కాలేజీ వద్ద విద్యార్థినిపై ప్రేమోన్మాది దాడి
గత రెండున్నర దశాబ్దాల కాలంలో ఆరు సార్లు సంక్రాంతికి బరిలో చిత్రాలను దించిన రవితేజ ఏడోసారి ‘ఈగల్’తో వాలబోతున్నాడు. ఈ విషయాన్ని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అధికారికంగా ధృవీకరించారు కూడా. ‘సూర్య వర్సెస్ సూర్య’తో దర్శకుడిగా మారిన కెమెరామేన్ కార్తీక్
ఘట్టమనేని ‘ఈగల్’ని తెరకెక్కిస్తున్నాడు. టైటిల్, రిలీజ్ డేట్ రివీల్ చేస్తూ మేకర్స్ విడుదల చేసిన ‘ఈగల్’ టీజర్ మాస్ మహరాజా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చిత్రం ఏమంటే ఇప్పటికే వచ్చే సంక్రాంతికి ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’, మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ రిలీజ్ కాబోతున్నాయనే ప్రకటన వచ్చింది. సో ప్రభాస్ తో రెండోసారి, మహేశ్ బాబుతో మొదటిసారి వచ్చే సంక్రాంతికి రవితేజ పోటీ పడబోతున్నాడన్నమాట! మరి ఈసారి ఎవరిది పైచేయి అవుతుందో చూద్దాం.