సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందుతోన్న సరికొత్త సినిమా ‘గుంటూరు కారం’. మాటల మాంత్రికుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.అతడు’ మరియు ‘ఖలేజా’ వంటి సూపర్ హిట్స్ తర్వాత వాళ్ళిద్దరి కలయిక లో తెరకెక్కుతున్న సినిమా ఇది.’గుంటూరు కారం’ సినిమాలో ఇద్దరు హీరోయిన్ లు ఉన్నారు. అందులో శ్రీలీల కూడా ఒకరు. ఇటు సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన తొలిసారిగా నటిస్తుంది శ్రీలీల. అలాగే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో కూడా తొలిసారి నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ.శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా సినిమా లో ఆమె ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. చీర కట్టుకుని నెయిల్ పోలిష్ వేసుకుంటూ… కిల్లింగ్ లుక్ తో మెరిసిపోయారు. ఈ లుక్ చూస్తుంటే… సినిమాలో ఆమె సంప్రదాయబద్ధంగా కనిపించే పాత్రలో నటించిందని అర్థం అవుతోంది.మహేష్ బాబు తండ్రి, దివంగత సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా సినిమా టైటిల్ ను వెల్లడించారు. ‘మాస్ స్ట్రైక్’ పేరుతో వీడియో గ్లింప్స్ ను విడుదల చేశారు.
ఆ గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేసింది.ఇంతకు ముందు ఎప్పుడూ మహేష్ బాబును చూపించనటువంటి మాస్ అవతారంలో త్రివిక్రమ్ ఆయనను చూపించారు. మిర్చి యార్డులో ఫైట్స్ విజువల్స్ మహేష్ అభిమానులను విపరీతంగా ఆకర్షించాయి.కర్రసాముతో రౌడీలను చితక్కొడుతూ మహేష్ బాబు అదిరిపోయే మాస్ ఎంట్రీ ని ఇచ్చారు. ఆయన సరికొత్త మాస్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. నోటిలో నుంచి బీడీ తీసి, స్టైలుగా వెలిగించి ‘ఏంది అట్టా చూస్తున్నావు… బీడీ త్రీడీలో కనపడుతుందా” అంటూ చెప్పే డైలాగ్ బాగా ఆకట్టుకుంది.. గుంటూరు నేపథ్యంలో మాస్ పక్కా ఫిల్మ్ గా ‘గుంటూరు కారం’ను రూపొందిస్తున్నారు.ఈ సినిమా గ్లింప్స్ లో థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందని చెప్పొచ్చు. మహేష్ కు ఈ సినిమాలో ది బెస్ట్ ఆల్బమ్ థమన్ ఇస్తాడు అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.