తెలుగు చిత్రపరిశ్రమకు సంక్రాంతి బాగా అచ్చివచ్చే సీజన్. ఆ టైమ్ లో స్టార్స్ నటించిన రెండు మూడు సినిమాలు విడుదలైనా ఆడియన్స్ ఆదరిస్తుంటారు. అందుకే మన స్టార్స్ సైతం తమ సినిమాలను సంక్రాంతికి వచ్చేలా ప్లాన్ చేసుకుంటుంటారు. తాజాగా మాస్ మహరాజా రవితేజ నటించే ‘ఈగల్’ మూవీ 2024 సంక్రాంతికి వస్తుందని మేకర్స్ ప్రకటించారు.
Sankranti War: ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో సీనియర్ స్టార్ హీరోలు అంటే బాలకృష్ణ, చిరంజీవి అనే చెప్పాలి. బాలకృష్ణ ఈ ఏడాదితో తన కెరీర్‌ను 50వ సంవత్సరంలోకి నెట్టేశారు. చిరంజీవి నటునిగా 46 ఏళ్ళు పూర్తి చేసుకోనున్నారు. ఈ ఇద్దరు హీరోల మొత్తం కెరీర్ ను పరిశీలిస్తే కొన్ని ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకుంటున్నాయి. వయసులో చిరంజీవి కంటే బాలకృష్ణ దాదాపు ఐదు సంవత్సరాలు చిన్నవాడు. అయితే నటునిగా చిరంజీవి కంటే నాలుగేళ్ళు బాలయ్యనే సీనియర్. బాలకృష్ణ…