Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం ఎలాంటి క్రేజ్‌తో దూసుకెళ్తుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నటి రష్మిక మందనకు నేషనల్ వైడ్ గా భారీ సంఖ్యలో అభిమానులున్నారు. ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలతో దుమ్ములేపుతోంది. 2016లో ‘కిరిక్ పార్టీ’ సినిమాతో రష్మిక తన కెరీర్‌ని ప్రారంభించింది. ఆమె తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో పాపులారిటీ సంపాదించుకుంది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఇప్పుడు బాలీవుడ్ వైపు మళ్లింది. ఇప్పటి వరకు రష్మిక దాదాపు 15 సినిమాల్లో నటించింది.
Read Also: Pushpa 2: వై కట్టప్ప కిల్డ్ బాహుబలి లా… పుష్ప ఎక్కడ ఉన్నాడు?
రష్మిక తన సినిమాల ద్వారా ప్రతి సంవత్సరం 8 కోట్లకు పైగా సంపాదిస్తుంది. ఆమె ఒక సినిమాకు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు తీసుకుంటుంది. కేవలం 27 ఏళ్ల వయసులో ఆమె మొత్తం సంపద రూ.65 కోట్లు. సినిమాలే కాకుండా, ఆమె ప్రకటనలు, మోడలింగ్ ద్వారా కూడా డబ్బు సంపాదిస్తుంది. సంపాదన పరంగా రష్మిక ఇద్దరు బాలీవుడ్ స్టార్‌కిడ్‌లను అధిగమించింది.
Read Also: Bollywood: ఇదెక్కడి కాంబినేషన్ సామీ… ఎగ్జైట్మెంట్ తో పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ?
బాలీవుడ్‌లో సారా అలీ ఖాన్, అనన్య పాండే హవా నడుస్తోంది. వీరి సంపద గురించే అభిమానులు ఎక్కువగా మాట్లాడుకుంటారు. కానీ ఆ స్టార్‌కిడ్లు కూడా రష్మిక కంటే వెనుకబడి ఉన్నారు. సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్ ల కూతురు సారా అలీ ఖాన్ నికర విలువ దాదాపు రూ.30 కోట్లు. ప్రతి నెలా ఆమె 50 లక్షల రూపాయల వరకు సంపాదిస్తుంది. సారా ఇప్పుడే సొంత ఇంటిని కొనుగోలు చేసింది. మరోవైపు నటుడు చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే నికర సంపద రూ.35 కోట్లు. అనన్య ఇప్పటి వరకు ఐదు సినిమాల్లో నటించింది.