యష్ రాజ్ ఫిల్మ్స్ బాలీవుడ్ లో ఒక స్పై యూనివర్స్ ని క్రియేట్ చేసింది. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, పఠాన్, వార్, టైగర్ 3, పఠాన్ 2, వార్ 2, టైగర్ Vs పఠాన్… ఇవి ఇప్పటివరకూ యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుంచి వచ్చిన సినిమాలు, రాబోతున్న సినిమాలు. ఏ క్యారెక్టర్ ని అయినా, ఎక్కడి నుంచైనా ఇంకో సినిమాలోకి తీసుకోని రావడమే ఈ యూనివర్స్ ముఖ్య ఉద్దేశం. పఠాన్ సినిమాలో టైగర్ సల్మాన్ ఖాన్ కనిపించట్లేదు, టైగర్ 3 సినిమాలో పఠాన్ షారుఖ్ ఖాన్ కనిపించబోతున్నట్లు… ఎక్స్టెండెడ్ క్యామియోస్ తో హ్యూజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని ఈ సినిమాల్లో చేపిస్తూ ఉంటారు. ఈ స్పై యూనివర్స్ లోకి కొత్త టైగర్ వచ్చింది. అదేంటి ఆల్రెడీ టైగర్ పాత్రతో సల్మాన్ ఖాన్ ఉన్నాడు కదా ఈ కొత్త టైగర్ ఏంటని ఆలోచన పడకండి. ఇది కొత్త టైగర్, యంగ్ టైగర్, లారీలో నుంచి జంతువులతో దూకింగ్ టైగర్, వెస్ట్రన్ ఆడియన్స్ మొత్తాన్ని ఇండియన్ సినిమాకి జేజేలు కొట్టేలా చేసిన టైగర్ ఇది. హృతిక్ రోషన్ తో వార్ 2 సినిమాని నెక్స్ట్ సెట్స్ పైకి తీసుకోని వెళ్లడానికి రెడీ అయిన యష్ రాజ్ ఫిల్మ్స్, ఈ సినిమాలో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని స్పెషల్ రోల్ కోసం కాస్ట్ చేసినట్లు సమాచారం.
బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీలో ఎన్టీఆర్-హ్రితిక్ రోషన్ కలిసి కనిపించబోతున్నారని అనలిస్ట్ తరన్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. ప్రొడ్యూసర్ ఆదిత్య కపూర్ వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ అండ్ హ్రితిక్ రోషన్ కాకుండా ఎన్టీఆర్ vs హ్రితిక్ ఉంటే అదో ప్రాపర్ ఇంటర్నేషనల్ సినిమాలా ఉంటుందని ఫీల్ అవుతున్నాడట. అందుకే ఎన్టీఆర్ ని స్పై యూనివర్స్ లోకి తీసుకోని వచ్చాడని సమాచారం. త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్న ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఎలాంటి పాత్రలో అయినా నటించి మెప్పించగల పెర్ఫర్మర్స్, ఎలాంటి స్టెప్ ని అయినా చాలా ఈజ్ తో చేసే డాన్సర్స్ అయిన ఎన్టీఆర్-హ్రితిక్ కలిసి కనిపిస్తే అది విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి. ఈ వార్త బయటకి రాగానే ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. మరి ఎన్టీఆర్-హ్రితిక్ రోషన్ లా ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.
IT’S OFFICIAL… HRITHIK – JR NTR IN ‘WAR 2’… #YRF pulls off a casting coup… #HrithikRoshan and #JrNTR will share screen space for the first time in #War2… #AyanMukerji directs. #YRFSpyUniverse pic.twitter.com/rGu8Z3Nzs7
— taran adarsh (@taran_adarsh) April 5, 2023