Rana Daggubati meet his fan in Chicago: టాలీవుడ్ హీరోలు అందరూ తమ అభిమానుల పట్ల చాలా ప్రేమగా ఉంటారు. ముఖ్యంగా టాలీవుడ్ హ్యాండ్సమ్ ‘హల్క్’ రానా దగ్గుబాటి అయితే దారిలో ఎవరు పలకరించినా.. చాలా ఆప్యాయంగా మాట్లాడుతుంటారు. అభిమానులకు ఆటోగ్రాఫ్ ఇస్తూ.. వారిని సంతోషపరుచుతుంటారు. తాజాగా మరోసారి రానా తమ అభిమానులతో సరదాగా మాట్లాడారు. అంతేకాదు అభిమాని గుండెలపై ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం రానా దగ్గుబాటి అమెరికాలో వెకేషన్‌లో ఉన్నారు. అక్కడ అందమైన ప్రదేశాల్లో తన సతీమణితో విహరిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. చికాగోలో కారులో వెళ్తుండగా.. రానాను చూసిన ఓ ఫ్యాన్ డ్రైవింగ్ చేస్తూనే పలకరించారు. రానా కూడా అతడికి హాయ్ చెప్పారు. ముందర కారు ఆపుతా అంటూ తన ఫ్యాన్‌కి రానా చెప్పారు. కారు దిగగానే అభిమాని రానాను గట్టిగా హగ్ చేసుకొని.. ఎమోషనల్ అయిపోయారు. ఆ తర్వాత రానా అతడి ఫ్యామిలీతో కూడా మాట్లాడారు. రోడ్డు పక్కనే అందరూ కలిసి సరదాగా ఫొటోలు దిగారు.
Also Read: Prabhas Birthday: ప్రభాస్ బర్త్ డే.. అభిమానులకు డబుల్ ధమాకా!
అభిమాని తన గుండెలపై ఆటోగ్రాఫ్ ఇవ్వాలని రానాను కోరారు. దీనికి ముందు రానా వద్దన్నా.. చివరకు షర్ట్‌పై ఆటోగ్రాఫ్ ఇచ్చారు. అలానే అతడి కారుపై కూడా సైన్ చేశారు. ఫ్యాన్ అభిమానాన్ని చూసి రానా ఎంతో మురిసిపోయారు. చివరకు ఓ హాగ్ ఇచ్చి అక్కడినుంచి రానా వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం ‘వేట్టయాన్’ చిత్రంలో రానా కీలక పాత్రలో నటిస్తున్నారు. 2022లో విడుదలైన ‘విరాట పర్వం’ తర్వాత హల్క్ వెండితెరపై కనిపించలేదు. ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌తో అలరించారు. నిఖిల్ నటించిన ‘స్పై’ సినిమాలోనూ ఓ స్పెషల్ రోల్‌లో తళుక్కున మెరిశారు.
Rana Daggubati Fan Encounter at Chicago🤩🤩🔥🔥
What a Lovely gesture🙌✨#RanaDaggubati pic.twitter.com/T0GqHe7na7
— Filmy Bowl (@FilmyBowl) August 19, 2024