Accident: రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ స్లీపర్ కోచ్ బస్సు టెంపోను ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో 11 మంది చనిపోయారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు, ముగ్గురు బాలికలు, ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. మృతుల మృతదేహాలను ప్రభుత్వాసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. బారీ సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని NH 11Bలోని సునిపూర్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. టెంపోలో ప్రయాణిస్తున్న వారందరూ బారీ నగరంలోని గుమత్ మొహల్లా నివాసితులు.…