Muzaffarnagar: ఫేస్‌బుక్‌లో ప్రవక్తపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌లో ఉన్న బుధానా పట్టణంలో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. నిఖిల్ త్యాగి అనే యువకుడు చేసిన ఈ వ్యాఖ్యతో ఆగ్రహించిన ముస్లిం సంఘాలు వేలాదిగా వీధుల్లోకి రావడంతో పెద్ద దుమారం మొదలైంది. ఆందోళనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి అదుపు తప్పింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు భారీ బలగాలను మోహరించారు. అంతేకాకుండా జిల్లా ఉన్నతాధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
T20 Emerging Asia Cup 2024: ఉత్కంఠపోరులో పాకిస్తాన్ పై భారత్ గెలుపు..
ఈ ఉద్రిక్త వాతావరణముకు సంబంధించి ముజఫర్‌నగర్ పోలీసులు నిందితుడు నిఖిల్ త్యాగిని అరెస్ట్ చేశారు. ఈ విషయమై జమియత్ ఉలేమా ఏ హింద్ నగర అధ్యక్షుడు ఆస్ మహ్మద్ తరఫున పోలీసులకు ఫిర్యాదు చేశారు. చట్టపరమైన చర్యల్లో భాగంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముజఫర్‌నగర్ ఎస్‌ఎస్పీ అభిషేక్ సింగ్ తెలిపారు.
Off The Record : జీవో 29 కాంగ్రెస్ కు ఇబ్బంది అవుతుందా ? రాహుల్ గాంధీ రంగంలోకి దిగుతారా ?
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ వ్యవహారం ఇంకా కొలిక్కి రాకపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బహ్రైచ్‌లో దుర్గా విగ్రహం నిమజ్జనం సందర్భంగా హింస చెలరేగింది. ఈ సమయంలో రామ్ గోపాల్ మిశ్రాపై కాల్పులు జరిపిన నిందితులను యూపీ పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. నిందితులు రింకూ సర్ఫరాజ్ ఖాన్, తాలిబ్ నేపాల్‌కు పారిపోయేందుకు ప్రయత్నించగా వారిద్దరినీ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఇంకా అక్కడ విషయం సంబంధించి వాతావరణం శాంతించలేదు. ఉత్తరప్రదేశ్ పోలీసులు కష్టపడి పరిస్థితిని అదుపులోకి తీసుకరావడానికి ప్రయత్నామ్ చేసారు. కానీ, ఇప్పటికీ పరిస్థితి మునుపటిలా కనిపించడం లేదు. బాధిత కుటుంబం కూడా సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసినా న్యాయం పట్ల సంతృప్తి చెందలేదు.
#मुजफ्फरनगर के बुढ़ाना कस्बे में सोशल मीडिया पर नबी पर आपत्तिजनक पोस्ट के बाद #मुस्लिम समाज ने हजारो की संख्या में सड़कों पर उतरकर किया प्रदर्शन,रॉड किया जाम,पुलिस ने सोशल मीडिया पर कमेंट करने वाले युवक अखिल त्यागी को गिरफ्तार किया।@muzafarnagarpol #muzaffarnagar #UP pic.twitter.com/CA2mX6JI19
— Anuj Tyagi (@AnujTyagi8171) October 19, 2024