ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయం మునుగోడు ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతోంది. అయితే.. ఏ పార్టీ నాయకులు ఆ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్‌కు ఈ ఉప ఎన్నిక సవాల్‌గా మారడంతో ఎమ్మెల్యే, మంత్రులు సైతం నియోజకవర్గంలోనే తిష్టవేసి ప్రచారం సాగిస్తు్న్నారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు సైతం నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. అయితే.. కాషాయనాథులు సైతం బీజేపీ జెండాను మనుగోడు ఎగురవేసేందుకు ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. అయితే.. తాజాగా నేడు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మునుగోడులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ 2014 ఎలక్షన్లలో నర్సాపూర్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా అన్నారని, నర్సాపూర్ కి కాళేశ్వరం నీళ్లు తెస్తా అన్నారు.
కాళేశ్వరం నీళ్లు రాలే, నమ్మి నార బొస్తే పిచ్చి బురలయ్యాయి అన్నట్టు తయారైంది. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అన్ని పనులు అవుతాయి. పక్కనే ఉన్న నర్సాపూర్ లో మాత్రం ఏం కావు. ఎవరికి ఉద్యోగాలు రాలే..కేసీఆర్ ఇంట్లో మాత్రం 4 ఉద్యోగాలు వచ్చాయి. ఇవాళ్టి మీటింగ్ కి రావొద్దు అని trs నేతలు డబ్బులు పంచుతున్నారు. టీఆర్‌ఎస్ ని బీఆర్‌ఎస్‌గా మార్చారు. టీఆర్‌ఎస్ ని వీఆర్‌ఎస్ ఇచ్చాము. బీఆర్‌ఎస్ కి ఇప్ప్పుడు కంపల్సరీ రిటైర్మెంట్ స్కిం (CRS ) ఇస్తామని రఘునందన్ రావు అన్నారు.