Kalyandurg: ఎన్నికల సమయంలో పలు నియోజకవర్గాల్లో వర్గ విభేదాలు మరోసారి తెరపైకి వస్తున్నాయి.. అవి కాస్తా రచ్చగా మారుతున్నాయి.. కల్యాణదుర్గం తెలుగుదేశం పార్టీలో మరోసారి విభేదాలు రచ్చకెక్కాయి.. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు.. మాజీ ఇంఛార్జ్ ఉమా వర్గాలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.. ఇప్పటికే సురేంద్రబాబు రాకను మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయి చౌదరి, నియోజకవర్గ ఇంఛార్జ్ ఉమామహేశ్వరనాయుడు వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవలే ఆ ఇద్దరు నేతలతో సంబంధం లేకుండా సురేంద్రబాబు.. కల్యాణదుర్గంలో భారీ ర్యాలీ నిర్వహించారు.. ఈ ర్యాలీకి ఉమా, ఉన్నం వర్గీయులు దూరంగా ఉన్నారు.. ఇది చాలదు అన్నట్టుగా ఇప్పుడు రెండు వర్గాల మధ్య ఫ్లెక్సీ వార్ తారాస్థాయికి చేరింది.
Read Also: Ajay Devgn : ఈ షేర్‌లో రూ. 2.74కోట్లు ఇన్వెస్ట్ చేసిన అజయ్ దేవగన్.. ఏడాదిలో ఎంత లాభమొచ్చిందంటే ?
రా కదలి రా సభకు తరలిరావాలంటూ ముదినాయినిపల్లిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు సురేంద్రబాబు.. అయితే.. వాటిని చించివేయడంతో కల్యాణదుర్గంలో వివాదాస్పదంగా మారింది. అంతేకాదు.. ఇది టీడీపీలో రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది.. తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఉద్దేశ్యపూర్వకంగానే చించివేశారంటూ సురేంద్రబాబు వర్గీయులు మండిపడుతున్నారు. అటు కల్యాణ్ దుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఉమామహేశ్వరరావును ప్రకటించాలని ఆయన మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు.