President Of India: టైమిచ్చిన రాష్ట్రపతి.. రేపు ఉదయం కలవనున్న ఇండియా ఎంపీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
President Of India: మణిపూర్ అంశంపై మాట్లాడటానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విపక్ష ఎంపీలకు సమయమిచ్చారు. రేపు ఉదయం 11.30 గంటలకు ఇండియా ఎంపీలకు రాష్ట్రపతి సమయం కేటాయించారు. మణిపూర్ హింసాకాండపై విపక్షాల ఆవేదనను ఆలకించాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అభ్యర్ధనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంగీకరించారు. మణిపూర్ అంశంపై చర్చించేందుకు బుధవారం 11.30 గంటలకు విపక్ష ఎంపీలతో సమావేశమయ్యేందుకు ముర్ము సమయం కేటాయించారు. గత రెండు నెలలుగా మణిపూర్ అట్టుడుకుతుండగా ఈశాన్య రాష్ట్రంలో హింసాకాండపై చర్చించేందుకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి విపక్షాలు పార్లమెంట్‌లో పట్టుబడుతున్నాయి. మణిపూర్ పరిస్ధితిపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ వేదికగా ప్రకటన చేయాలని కూడా విపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ సర్కార్ ఉన్న మణిపూర్‌లో హింస అదుపుతప్పడంతో పలువురు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు అల్లర్లతో అట్టుడికిన మణిపూర్‌లో క్షేత్రస్ధాయి పరిస్ధితులను మదింపు చేసేందుకు ఇటీవల విపక్ష ఎంపీల బృందం ఆ రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటించింది. మణిపూర్‌లో పరిస్ధితిని చక్కదిద్దేందుకు జోక్యం చేసుకోవాలని విపక్ష నేతలు రాష్ట్రపతిని కోరారు.
Read also: Andhrapradesh: సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన నీతి ఆయోగ్ ప్రతినిధుల బృందం
Also Read
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
- CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
- Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
విపక్ష నేతల కూటమి ఇండియా (INDIA) ఫ్లోర్ లీడర్లు, మణిపూర్‌లో పర్యటించిన 21 మంది ఎంపీలతో కూడిన ప్రతినిధి బృందం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu)ను బుధవారం కలుసుకోనున్నారు. మణిపూర్‌లో పరిస్థితిని ఈ సందర్భంగా వారు రాష్ట్రపతికి వివరించనున్నారు. హర్యానాలో మత ఘర్షణలు చెలరేగడం, పార్లమెంటు పనితీరు వంటి అంశాలను కూడా ప్రతినిధి బృందం రాష్ట్రపతితో చర్చించే అవకాశం ఉంది. మణిపూర్ హింసాత్మక ఘటనలపై సోషల్ మీడియాలో జూలై 19న వచ్చిన వీడియో దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఇద్దరు మహిళలను వివస్త్రగా ఊరేగించినట్టు కనిపిస్తున్న ఆ ఘటన మే 4న జరిగింది. మే 3న జాతుల ఘర్షణ తలెత్తిన మరుసటి రోజు ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై ఇటీవల సీబీఐ దర్యాప్తు చేపట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఐపీసీ, ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నప్పటి నుంచి 180 మంది ప్రాణాలు కోల్పోగా, వీరిలో 60 మంది మెయితీలు, 113 మంది కుకీలు, ముగ్గురు సీఏపీఎఫ్ సిబ్బంది, ఒక నేపాలీ, ఒక నాగా, ఒక గుర్తుతెలియని వ్యక్తి, 20 మంది మహిళలు ఉన్నారు. 6500కు పైగా ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి.
తాజావార్తలు
-
తెలంగాణ జలియన్‌వాలాబాగ్.. September 17 వేళ గూస్బంప్స్ తెప్పించే వీరుల చరిత్ర!
-
UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
-
Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
-
Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
-
Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!