ఎండలు మండిపోతున్నాయి. మద్యం ప్రియులకు వేడి గట్టిగా తగులుతోంది. దీంతో.. లిక్కర్ నుంచి బీర్ల వైపు మనసు మళ్లుతుంటారు. బీర్ కూల్ అవ్వకముందే.. ఫ్రిడ్జిలో నుంచి తీసి ఇచ్చేయ్యాల్సిందే. అయితే బీర్లు ఎక్కువగా తాగడం వల్ల అనేక అనర్థాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఇప్పటివరకు అనేక అధ్యయనాలలో పురుషుల కంటే స్త్రీలు తక్కువ గుండెపోటు ప్రమాదాలకు గురవుతారని కనుగొన్నారు. అయితే.. తాజాగా జరిగిన ఒక అధ్యయనంలో మెనోపాజ్ (రుతుక్రమం ఆగిపోవడం) అనుభవించిన స్త్రీలు గుండె సంబంధిత వ్యాధులు పట్ల తక్కువగా ప్రభావితం అవుతారని వెల్లడైంది. వారి రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయని.. దీని ఫలితంగా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని అధ్యయనం తెలిపింది.
స్మార్ట్‌ఫోన్‌లపై ఆధారపడటం రోజు రోజుకూ పెరుగుతోంది. ఒక అధ్యయనం ప్రకారం.. 2040 నాటికి భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య 1.55 బిలియన్లకు చేరుకుంటుంది. సాధారణ సంభాషణ నుంచి మెసేజింగ్ తో పాటు సంగీతం నుంచి పుస్తకాల వరకు, సినిమాల నుంచి గేమింగ్ వరకు.. పిల్లల నుంచి పెద్దల వరకు అన్నింటికీ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ అవసరం. కానీ.. ఇదే ఫోన్‌ను ఆరోగ్యం, ఫిట్‌నెస్ కోసం ఎందుకు ఉపయోగించకూడదు!
యాంటీబయాటిక్స్.. శరీరంలో బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. కానీ వాటిని అధిక మొత్తంలో తీసుకోవడం ఇతర రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్లు వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యాంటీబయాటిక్స్ కూడా దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. ఇప్పటికే మందులు వాడుతున్న హార్ట్ పేషెంట్లు డాక్టర్‌ని సంప్రదించకుండా మరే ఇతర యాంటీబయాటిక్ మందులను తీసుకోకపోవడం మంచిది.
వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్న వారు వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు.
Heart disease: స్త్రీల కన్నా పురుషులే ఎక్కువగా గుండె వ్యాధుల బారిన పడుతుండటం చూస్తాం. గుండెపోటు మరణాలు వంటివి పురుషులకే ఎక్కువగా వస్తుంటాయి. అయితే, దీనికి జీవసంబంధమైన, హార్మోన్, జీవనశైలి అలవాట్లు కూడా కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. కార్డియో వాక్యులర్ డిసీసెస్(CVDs) ఏడాదికి 17.9 మిలియన్ల మరణాలకు కారణమవుతున్నాయి. స్త్రీలతో పోలిస్తే పురుషులు చాలా తరుచుగా చిన్న వయసులోనే ఈ జబ్బుల బారిన పడుతున్నారు.
గర్భిణులకు పోషకాహారం చాలా చాలా అవసరం. ఎందుకంటే గర్భంలో బిడ్డ శారీరక ఎదుగుదల, ఆరోగ్యం బాగుండాలంటే ఖచ్చితంగా పోషకాహారాన్ని తింటూ ఉండాలి. రోజూ మీరు తినే ఆహారంలో పోషకాలు పుష్కలంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఓ అధ్యయనంలో కీలక విషయం బయటపడింది. రోజు తినే ఆహారాన్ని 8 గంటల వ్యవధికి పరిమితం చేయడం వల్ల గుండె సమస్యలు వచ్చి చనిపోయే ప్రమాదం 91శాతం పెరుగుతుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) తెలిపింది. ఈ నివేదిక విడుదలకు ముందు ఇతర నిపుణులతో ఈ విషయాన్ని ఏహెచ్ఏ బయటపెట్టింది. ఈరోజుల్లో చాలామంది బరువు తగ్గడం కోసమని, దేవుడి పూజలో పాల్గొనందున అడపాదడపా ఉపవాసం చేస్తున్నారు. మరోవైపు.. బరువుతగ్గడం కోసం ఇతర రకాల మెడిసిన్స్ కూడా వాడుతున్నారు.…
విమానంలో శ్వాస ఆగిపోయిన రెండేళ్ల చిన్నారి ఓ వైద్య బృందం రక్షించింది. బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న విస్తారా విమానంలో రెండేళ్ల చిన్నారి శ్వాస ఆగిపోగా.. విమానంలో ఉన్న వైద్యులు వచ్చి పాపకు చికిత్స చేయాలని సిబ్బంది అత్యవసర ప్రకటన చేశారు.