ప్రపంచంలో చాలా మంది జనాలు ప్రీడయాబెటిస్ సమస్యతో పోరాడుతున్నారు. బ్లడ్ షుగర్ సాధారణ స్థాయి కంటే పెరగడాన్ని ప్రీడయాబెటిస్ అంటారు. మరోవైపు ఈ వ్యాధిని యువత కూడా ఎక్కువగానే ఎదుర్కొంటున్నారు. ప్రీడయాబెటిస్ వల్ల గుండె జబ్బులు, పక్షవాతం మరియు టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.