దేశవ్యాప్తంగా 2024 – 25 సంవత్సరానికి గాను వివిధ పోస్టల్ సర్కిల్లో ఖాళీగా ఉన్న గ్రామీణ డాగ్ సేవక్ పోస్టులకు సంబంధించి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ చేయబోతోంది. ఇందుకు సంబంధించి అతి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పోస్టల్ డిపార్ట్మెంట్ ఏర్పాట్లను చేస్తుంది. 2023 జనవరిలో దాదాపు 40 వేల పోస్టుల భర్తీ చేసిన సంగతి తెలిసిందే. కాబట్టి చాలామంది ఈ ఏడాది కూడా ఈ నోటిఫికేషన్ భారీగా వెలబడనున్నట్లు వేచి చూస్తున్నారు.
Also read: DD News: రంగు మారిన డీడీ న్యూస్ చిహ్నం.. ప్రసార భారతి కాదు ప్రచార భారతి అంటూ..
ఇక ఈ పోస్టులకు అభ్యర్థుల ఎన్నిక భాగంగా కేవలం పదవ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగానే వీటిని భర్తీ చేయనున్నారు. అది కూడా ఎటువంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థులను కేవలం మెరిట్ లిస్ట్ ఆధారంగా భర్తీ చేయబోతున్నారు. ఇక అభ్యర్థుల వయసు కచ్చితంగా 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో మాత్రమే ఉండాలి. ఇక ఓబిసి లకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీ లకు ఐదేళ్లు, వికలాంగులకు 10 ఏళ్ల వరకు గరిష్ట వయోపరిమితిని కల్పించారు.
Also read: SSMB29 : వావ్..సూపర్ స్టార్ లుక్ న్యూ లుక్ అదిరిపోయిందిగా..
ఇక పదో తరగతి మెరిట్ లిస్ట్ ఆధారంగా మాత్రమే ఈ ఎంపిక కొనసాగుతుంది. ఇందులో ఎంపికైన వారు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాగ్ సేవక్ లాంటి పోస్టులలో విధులను నిర్వహించబోతున్నారు. ఇక ఇందులో పోస్ట్ ను బట్టి వారి జీతం పది వేల నుంచి 12 వేల వరకు మొదట ప్రారంభ వేతనం ఇవ్వనున్నారు. ఇకపోతే ఈ పోస్టులకు ఎంపిక కాబడిన వారు రోజు 4 గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు సంబంధించిన పనులను కూడా నిర్వహించవచ్చు. వీటికి గాను ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో ప్రోత్సాహం లభిస్తుంది. ఈ పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలను అధికారిక వెబ్సైట్ లో తెలుసుకోవచ్చు.