భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ టెలివిజన్ ఛానల్ దూరదర్శన్ కేంద్ర ప్రభుత్వం పట్ల స్వామి భక్తిని ప్రదర్శించినాట్లు కనపడుతోంది. ప్రపంచ వార్తలను ప్రసారం చేసే జాతీయ దూరదర్శన్ న్యూస్ ఛానల్ లోగో రంగును తాజాగా కాషాయ రంగులోకి మర్చి తన విధేయతను తెలిపింది. ఇక ఈ మార్పులో కేవలం రంగు మాత్రమే కాకుండా లోగోతో పాటు న్యూస్ అనే అక్షరాలను కూడా కాషాయ రంగులోకి మార్చడం వల్ల కేంద్ర అధికార పార్టీ బీజేపీ పై పెద్దయెత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: Lok Sabha Election 2024 : 16.63 కోట్ల మంది ఓటర్లు, 1625 మంది అభ్యర్థులు.. 6 గంటలకు తేలనున్న భవితవ్యం
దేశంలో టీవీ చానెల్స్ మొదలైనప్పటి నుండి ఉన్న ఎంతో గొప్ప చరిత్ర గల డీడీ న్యూస్ లోగో కాషాయరంగులోకి మారిపోయింది. ఇకపోతే ఈ మార్పుపై ‘ ఇది ప్రసార భారతి కాదు.. ప్రచార భారతి.. ’ అని గతంలోనే దూరదర్శన్ సీఈవోగా పనిచేసిన టీఎంసీ ఎంపీ జవహర్ సర్కార్ విమర్శించిన సంగతి తెలిసిందే.
Also Read: PBKS vs MI: అతడు మమ్మల్ని భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
ఇందులో భాగంగానే దూరదర్శన్ మతచర్య ఉద్రిక్తతలను పెంచుతుందని కేరళ సీఎం పినరయి విజయన్ కూడా తీవ్రంగా ఖండించారు. చూడాలి మరి ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో ఈ మార్పు ఎంతటి రాజకీయ విషయంగా పులుముకుంటుందో. ఈ మధ్య కలలో సాక్షి ఛానల్ లోగో మారినప్పుడు కూడా అనేక వాదనలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.