టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..హ్యాండ్సమ్ లుక్ తో ,అద్భుతమైన నటనతో టాలీవుడ్ లో మహేష్ సూపర్ స్టార్ గా ఎదిగారు .మహేష్ నటించిన లేటెస్ట్ మూవీ “గుంటూరు కారం”.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల అయి మంచి విజయం సాధించింది .మొదట్లో ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చిన కూడా కలెక్షన్స్ పరంగా దుమ్మురేపింది . ఈ సినిమాలో శ్రీలీల,మహేష్ బాబు డాన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు . ఇదిలా ఉంటే మహేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గురించి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు .మహేష్ తన తరువాత సినిమా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే ..ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు , అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు .ఫారెస్ట్ అడ్వెంచర్ ఫిల్మ్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది . ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో కంప్లీట్ యాక్షన్ సీక్వెన్సులతో ఈ సినిమా కథ ఉండబోతోందని తెలుస్తోంది.
పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ చిత్రాన్ని రాజమౌళి వెండి తెరఫై ఆవిష్కరించే ప్రయత్నం చేయబోతున్నారు. అడ్వాన్స్ టెక్నాలజీని ఈ మూవీ షూటింగ్ కోసం ఉపయోగించబోతున్నారని సమాచారం .అలాగే హాలీవుడ్ యాక్టర్స్ ని సినిమాలో కీలక పాత్రల కోసం ఎంపిక చేయబోతున్నారని సమాచారం .ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని సమాచారం .తాజాగా మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి మరియు నిర్మాత కెఎల్ నారాయణ ఈ ఉదయం దుబాయ్ నుండి తిరిగి వస్తూ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కనిపించారు. మహేష్ బాబు మరియు ఎస్ఎస్ రాజమౌళిని కలిసి చూడటం అభిమానులు ఎగబడ్డారు..వారు ఎస్ఎస్ఎంబి29 ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం దుబాయ్ వెళ్లినట్లు సమాచారం .తాజాగా మహేష్ లుక్ ప్రేక్షకులను ఆశ్చర్య పరిచింది .ఈ మూవీ కోసం మహేష్ పూర్తిగా తన లుక్ ని మార్చేశాడు .ఈ సినిమా లో గుబురు గడ్డం తో ,జులపాల జుట్టుతో మెలితిప్పిన మీసంతో మహేష్ లుక్ అదిరిపోయింది ..ప్రస్తుతం సోషల్ మీడియా లో మహేష్ లుక్ వైరల్ అవుతుంది .
#MaheshBabu Latest Look 🔥#SSMB29 #MaheshBabu#SSRajamoulipic.twitter.com/ClFfHNTYyU
— Milagro Movies (@MilagroMovies) April 19, 2024