ప్రముఖ యాంకర్ స్వేచ్ఛ నిన్న ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే తన బలవన్మరణానికి పూర్ణచందర్ కారణం అని ఆమె తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ సంచలన లేఖ రాశారు. మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ సమాజానికి పూర్ణచందర్ స్వయంగా చేస్తున్న విన్నపం. ప్రముఖ జర్నలిస్ట్ స్వేచ్చా బలవన్మరణం గురించి నేను ఖచ్చితంగా చెప్పుకోవలసిన కొన్ని నిజాలు – నేను మీడియా ద్వారా ప్రజలకు చెప్పలేని స్థితిలో అబద్ధం తెలంగాణ మొత్తం చుట్టేస్తుందని భయం..
స్వేచ్ఛ నాకు 2009 నుండి పరిచయం. మేము ఇద్దరము T-NEWS లో పని చేసే వాళ్ళము. T-NEWSలో మేము స్నేహితులుగా ఎన్నో విషయాలు షేర్ చేసుకునే వాళ్ళము. వాళ్ళ తల్లి దండ్రులు జనశక్తిలో పని చేస్తూ 6 నెలల వయసు ఉన్న స్వేచ్ఛను వారి అన్న వదినలకు వదిలేసి.. సంవత్సరానికి ఒకసారి చుట్టం చూపుగా వచ్చిపోయి, స్వేచ్ఛను వదిలేసిన తల్లిదండ్రుల గురించి ఎన్నో సార్లు చెప్పుకుని బాధపడ్డ సందర్భాలు నేను గుర్తు చేసుకుంటున్న ఈ సందర్భంగా.
స్వేచ్ఛ తరువాత ఏవిధంగా ప్రముఖ ఛానళ్లలో జర్నలిస్టుగా మంచి గుర్తింపు సంపాందించిన తర్వాత నేను ఎంతో సంతోషించిన సందర్భాలున్నాయి. దురదృష్టవశాత్తు 2008 నుండి 2009 మధ్య కాలంలో మొదటి వివాహాంలో విడాకులు, 2016 నుండి 2017 ప్రాంతంలో రెండవ వివాహంలో విడాకులు తీసుకున్న స్వేఛ్ఛ ఏ రోజు కూడా జీవితంలో సంతృప్తిగా ఉన్న సంధర్భాలు లేవు. ఆమె సంతోషాన్ని ప్రజలకు అందించే వార్తల్లో వెతుక్కుంది. రెండవ వివాహం ద్వారా తనకు కలిగిన పాప అరణ్యలో వెతుక్కున్నేది. తన భాదను రాతల రూపంలో తెలియజేసిన సందర్భాలు కోకొల్లలు.
Also Read:Ambati Rambabu: రిటైర్మెంట్‌కు వస్తున్నా.. నా చివరి మజిలీ గుంటూరు..
2009 నుండి స్నేహితురాలిగా మాత్రమే పరిచయం ఉన్న స్వేచ్చ 2020 నుండి నాకు దగ్గరైన మాట వాస్తవమే. 2017 రెండవ వివాహం ద్వారా జరిగిన విడాకుల తర్వాత హైదరాబాద్ రాంనగర్ లో వారి తల్లి దండ్రలతో ఉంటూ పూర్తి డిప్రెషన్లోకి వెళ్ళిన మాట వాస్తవము. వారి తల్లి దండ్రులు ఇరువురు జనశక్తిలో గతంలో పని చేస్తూ, వారి నాన్న సామభూతి పరునిగా, అమ్మ మహిళా సంఘాలలో పని చేస్తూ, ఏరోజు స్వేచ్ఛకు వారు అమ్మనాన్నల ప్రేమను అందించలేదు. వారు ఇరువురు పెట్టుకునే గొడవలతో రామ్ నగర్ ఇంట్లో ఉండలేక పోతున్నా, అని నాతో చెప్పుకున్న సందర్భాలు నా కళ్ళ ముందు మెదులుతున్నాయి.
Also Read:Kannappa : కన్నప్పపై ట్రోల్స్ అందుకే రావట్లేదు.. విష్ణు కామెంట్స్
చివరికి 2020 సంవత్సరములో తల్లి దండ్రులతో ఉండలేక కవాడిగూడలో తను స్వంతంగా అద్దె ఇల్లు తీసుకొని, 2022 ప్రాంతంలో తన పాపను కూడా వారి తల్లి దండ్రుల దగ్గర నుండి తన వద్దకు తెచ్చుకున్నది. ప్రతిసారి ఒక్కటే భాద వృక్త పరిచేది, నా లాంటి జీవితం నా పాపకు రాకూడదు, నా పాపను తల్లిగా నేనే దగ్గరుండి చూసుకోవాలి అని చెప్పేది.
2022 నుండి దాదాపు పాప భాధ్యతను పూర్తిగా నేనే తీసుకున్నాను. ఆమె చదువు, ఆమెకు కావలిసిన అన్ని అవసరాలను దాదాపు ఒక తండ్రి స్థానంలో భాద్యత తీసుకున్నాను. పోయిన సంవత్సరము అరణ్య Mature అయినప్పుడు స్వేచ్ఛ భాదపడకుండా అరణ్య భాదపడకుండా నా స్వంతంగా 5 లక్షల రూపాయల ఖర్చు చేసి Function చేయడం జరిగింది. ఆమె గత ఐదు సంవత్సరాల నుండి డిప్రెషన్ నుండి బయటకి రావడానికి Anxiety, Emotional tendancies wow wasiht రావడానికి మారి సాళ్లు Hospitals కి తీసుకెళ్ళడం, Scannings medical reports అన్ని కూడా కవాడిగూడ తన రూమ్ లో ఉన్నాయి.
Also Read:Anchor Swecha: యాంకర్ స్వేచ్చ ఆత్మహత్య వేళ.. పూర్ణచందర్ సంచలన లేఖ
అరణ్య పాప నున్ను పూరి అని ముద్దుగా పిలిచేది. స్పేచ్చ నా దృష్టిలో అన్ని ఉన్న అనాథ. అమ్మ నాన్న 6 నెలల వయసులో వదిలేశారు. రెండు పెళ్ళిళ్ల ద్వారా తనకు మోసం జరిగింది. రెండు పెళ్ళిల విడాకుల తర్వాత, తన పాపతో జీవితంలో పూర్తిగా డిప్రెషన్ లోనే ఉంది. స్వేచ్ఛ, అరణ్య అనాథలాగా భాదపడకూడదు సంతోషంగా ఉండాలనేదే నా ఉద్దేశ్యం, నేను అదే కొరుకున్నా, తన పాప అరణ్య నా పాప అయిపోయింది. పూర్తి, భాధ్యత తీసుకున్నా ఉప్పల్ లోని కేంద్రీయ విశ్వ విద్యాలయంలో పాపను జాయిన్ చేయించాను, ఫీజులు కడుతూ వస్తున్నా.. ఇప్పుడు అరణ్య పాప 9 వ తరగతి చదువుతున్నది.
నాకు సేచ్చకు అరణ్యకు ఎటువంటి విభేదాలు లేవు. మీడియా ద్వారా అరణ్య పాప మాటలు నన్ను బాధించాయి. ఈ నెలలోనే స్వేచ్ఛ ఆమె స్వతహాగా దేవుడిని పెద్దగా నమ్మకపోయినా, ఒకసారి అరూణాచలం తీసుకెళ్ళుమని కోరితే తీసుకెళ్ళాను. సంతోషంగా గడిపింది. సంఘటన జరిగే ముందు రోజు స్వేచ్ఛ వాళ్ళ నాన్న, స్వేచ్ఛ, అరణ్య ఉంటున్న ఇంటికి వచ్చి, స్వేచ్ఛ విషయం చెప్పగానే అతను అన్న మాటలు స్వేచ్ఛను పూర్తిగా బాధించాయి. ఆమెను పూర్తిగా అవమానించాడు వాళ్ల నాన్న.
“రెండు సంవత్సరాలకొకసారి ఒక మనిషిని తీసుకువచ్చి మీ అల్లుడు అని పరిచయం చేస్తే నేను తలదించుకోవాల్సి వస్తుంది. నాకు డబ్బు లేకపోవచ్చు. కానీ PDSU లో పని చేసాను, గౌరవాన్ని కోల్పోను అని స్వేచ్చ వాళ్ళ నాన్న చేసిన అనుచిత, అగౌరవ వ్యాఖ్యలు ఆమెను చాలా బాధించాయి. నాకు చెప్పుకొని ఏడ్చింది. నేను ఇదే విషయం వాళ్ళ అన్న వదినలతో ప్రస్తావించాను. అలా మాట్లాడడం తప్పే అని వాళ్లు కూడా అన్నారు. నేను స్వేచ్ఛ, అరణ్యను చూసుకున్న విధానం వారి బంధువులు అందరికీ తెలుసు. స్వేచ్చ తన ప్రతి SOCIAL MEDIA హ్యాండిల్ లో స్వేచ్చపూర్ణచందర్ అని రాసుకుంది. నన్ను భర్తగా ఊహించుకుంది. పెళ్ళి చేసుకోమంది.
నేను స్వేచ్ఛ, అరణ్యలను బాగా చూసుకున్నా. స్వేఛ్ఛ జీవితంలో కొల్పోయిన ఆనందాన్ని ఇచ్చాను. ఏ రోజు ఆమె చావును నేను కోరుకోలేదు. మీడియా ముందు వారి అమ్మనాన్నలు, బంధువులు చేస్తున్న అరోపణలు అబద్ధం. నేను ఏరోజు పెళ్లి పేరుతో మోసం చేయలేదు. ఒత్తిడి చేయలేదు. నేను ఈ లేఖ రాయకపోతే తెలంగాణ సమాజం అబద్ధం నిజం అనుకునే ఆస్కారం ఉన్నది.
చిన్నప్పటి నుండి క్రమ క్రమంగా ఆమెను ఆవహించిన ఒంటరి తనానికి ఆమె మానసిక స్థితికి నేను కారణం కాదు. పోలీసు వాళ్ళు నాకుటుంబ సభ్యులను పోలిస్ స్టేషన్ కు పిలిపించి, బెదిరించి, పూర్ణచందర్ వచ్చే వరకు మీరు పోలీస్ స్టేషన్ లో ఉండాలి అని చేసిన విధానం నన్ను బాధించాయి. నేను నిర్ధోశిని, కోర్టులలో చెప్పే నిజాలు ప్రజలకు తెలియవు. అందుకే మీడియాను ఆశ్రయించాను. లా విల్ టేక్ ఇట్ ఓన్ కోర్స్ ఐ బిలివ్ ఇన్ లా యాస్ ఏ లా అబైండింగ్ సిటిజన్ అంటూ లేఖ ద్వారా పూర్ణ చందర్ తన ఆవేదనను వెల్లడించారు.