Revanth Reddy : టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ హాల్ ను హైడ్రా అధికారులు కూల్చేశారని.. ఆ తర్వాత నాగ్ రియలైజ్ అయి తమ్మిడికుంట చెరువుకోసం రెండెకరాలు ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పీజేఆర్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడారు. హైదరాబాద్ ఒకప్పుడు ఎంతో అందంగా ఉండేదన్నారు. ఇష్టారీతిన చెరువులు, నాలాలు కబ్జా చేయడం వల్ల నీటిలో మునిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని క్లియర్ చేయడానికే తాము హైడ్రాను తీసుకొచ్చినట్టు ఆయన వివరించారు.
Read Also : Allu Aravind : వారిద్దరినీ చూస్తే నాకు భయమేస్తుంది.. అల్లు అరవింద్ కామెంట్స్..
నాగార్జునలాగా అందరూ ముందుకు రావాలి. ఆయన నగర అభివృద్ధి కోసం రెండెకరాలు ఇచ్చి తాను రియల్ హీరోను అని నిరూపించుకున్నాడు. హైడ్రా వచ్చిన తర్వాత కబ్జా చేయాలంటే చాలా మంది భయపడుతున్నట్టు రేవంత్ వెల్లడించారు. రేవంత్ రెడ్డి నాగార్జున గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నడుమ రేవంత్ పెడుతున్న కార్యక్రమాలకు నాగార్జున వెళ్లి కలుస్తున్న విషయం తెలిసిందే. మొన్న అఖిల్ పెళ్లికి రేవంత్ వెళ్లి ఆశీర్వదించారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత సమయంలో వీరిద్దరి నడుమ విభేదాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. కానీ వీరు మాత్రం ఎప్పుడూ కలుస్తూనే ఉన్నారు. దీంతో వాటికి చెక్ పడ్డట్టు అయింది.