Kannappa : కన్నప్పకు థియేటర్లలో పాజిటివ్ టాక్ రావడంతో మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా విష్ణు చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చాడు. టీజర్ వచ్చినప్పుడు మాపై చాలా ట్రోల్ చేశారు. ఆ లొకేషన్స్ ఏంటి అంటూ నెగెటివ్ కామెంట్స్ చేశారు. అప్పటి నుంచే మేం చాలా జాగ్రత్త పడ్డాం. ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక ట్రోల్స్ కు అవకాశం ఇవ్వకుండా కథను చెప్పగలిగాం. మేం ఎంత జాగ్రత్తపడ్డా సరే సినిమాలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. కానీ బలమైన కథ వాటిని కవర్ చేసేసింది. అందుకే ట్రోల్స్ కు అవకాశం లేకుండా పోయింది.
Read Also : Bigg Boss 9 : బిగ్ బాస్-9లోకి ఎవరైనా వెళ్లే ఛాన్స్.. ఇలా చేయండి చాలు..
ప్రేక్షకులు మమ్మల్ని ఒకే కారణంతో మన్నించారు. చివరి గంట సేపు సినిమాలో వాళ్లు లీనమైపోయారు. థియేటర్ల నుంచి ఓ మంచి ఎమోషన్ తో బయటకు వచ్చారు. అదే మాకు ప్లస్ పాయింట్. చాలా మంది ప్రభాస్ వచ్చాక సినిమా మారిపోయిందని అనుకుంటున్నారు. కానీ శరత్ కుమార్ గారితో సంభాషణ తర్వాత మూవ మారిపోతుంది. కానీ అది ఎవరూ గమనించలేదు. బహుషా ప్రభాస్ కు ఉన్న స్టార్ ఇమేజ్ వల్ల కావచ్చు. ప్రభాస్ వల్లే మూవీకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. అతని కోసం వచ్చి కన్నప్ప కథను తెలుసుకుంటున్నారు. దానికి ప్రభాస్ కు ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటూ తెలిపారు.
Read Also : Venky Atluri : సూర్య పాత్ర రివీల్ చేసిన వెంకీ అట్లూరి..