పుష్ప -2 రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళా మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీ తేజ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనను సీరియస్ తీసుకున్న పోలీసులు చిత్ర హీరో అల్లు అర్జున్ తో పాటు చిత్ర నిర్మాతలు, మైత్రీ మూవీస్ అధినేతలు ఎలమంచిలి రవి శంకర్, నవీన్ యెర్నేనిపై కేసు నమోదు చేసారు.
Also Read : Bhagyashree : భలేగా ఛాన్స్ లు కొట్టేస్తున్న భాగ్యశ్రీ
అయితే ఈ కేసులో తమపై నమోదు చేసిన కేసు కొట్టి వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు ప్రొడ్యూసర్లు ఎలమంచిలి రవి శంకర్, నవీన్. అసలు థియేటర్ భద్రత తమ పరిధి కాదని, తమ బాధ్యత గా ముందే పోలీసులకు సమాచారం ఇచ్చామని, సమాచారం ఇచ్చాము కాబట్టే అంత మంది పోలీసులు అక్కడ ఉన్నారని, అన్ని చర్యలు తీసుకున్నపటికి అనుకొని ఘటన జరిగింది, జరిగిన ఘటన కు సినిమా ప్రొడ్యూసర్లు నిందితులుగా చేరిస్తే ఎలా అని వాదనలు వినిపించారు పిటిషనర్ తరపు న్యాయవాది. ఈ కేసులో ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం పుష్పా 2 ప్రొడ్యూసర్స్ కు భారీ ఊరట కల్పించింది. పుష్ప -2 ప్రొడ్యూసర్లను అరెస్ట్ చేయవద్దని హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తూ, తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.