Ponnam Prabhakar : త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా, ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరాలనే సంకల్పంతో, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని ఆయన సూచించారు. గురువారం, సిద్ధిపేట జిల్లాలోని కోహెడ్ లో పర్యటించిన ఆయన, అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. ఈ సమావేశంలో, లోకల్ బాడీ ఎలక్షన్ల కోసం ప్రస్తుతం నుంచే పార్టీ నాయకులు వ్యూహాత్మకంగా…