వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో శనివారం ఘనంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్–పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, యువజన–క్రీడల, పశువర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి రెండు ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు.
ఖమ్మం జిల్లా పాల్వంచలో జరిగిన ఆత్మగౌరవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రలో ఖమ్మం ప్రత్యేకమైన స్థానం ఉందని గుర్తు చేస్తూ 1969లోనే తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది ఖమ్మం అని ఆయన అన్నారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈనెలాఖరు లోగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. హైదరాబాద్ నగరంలోని హౌసింగ్ బోర్డుతో జాయింట్ వెంచర్‌గా ఉన్న ప్రాజెక్టుల్లోని సమస్యలను త్వరగా పరిష్కరించాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర…
Konda Surekha : వరంగల్ తూర్పులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా, పేదల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ మంత్రి కొండా సురేఖ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని పేదలందరికీ ఆవాసం కల్పించాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని ఆమె తెలిపారు. 15 సంవత్సరాల విరామం తర్వాత పేదలకు ఇళ్ల నిర్మాణం జరగడం ఎంతో గర్వకారణమని, ఇందుకు అనుకూలంగా ప్రభుత్వం రూ.22,500 కోట్లు వెచ్చించి నాలుగు సంవత్సరాల్లో 20 లక్షల ఇళ్ల…
ఈ నెల 5 న కేబినెట్ సమావేశం నిర్వహించి కీలక అంశాలను చర్చించాలని మంత్రుల సమావేశంలో నిర్ణయించారు. ఇవాళ ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.
ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ.. చెంచులకు 9200 ఇండ్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ఐటిడిఎ ప్రాంతంలో ఉండే నియోజక వర్గాలకు అదనంగా ఇస్తున్నామని వెల్లడించారు. 2 లక్షల 10 వేల ఇండ్లు అర్హుల జాబితా ఫైనల్ అయ్యిందని ప్రకటించారు. 24 వేల ఇండ్లు నిర్మాణం ప్రారంభం అయ్యిందని.. నిర్మాణానికి రూ. 130 కోట్లు చెల్లించామని తెలిపారు. పారదర్శకంగా అర్హుల ఎంపిక చేస్తున్నామని.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న…
జూన్2 న భూమి లేని నిరుపేద రైతులు ఎవరైతే అసైన్డ్ భూములను సేద్యం చేస్తున్నారో వారికి పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అధికారులతో జరిగిన సమావేశంలో పొంగులేటి కీలక సూచనలు చేశారు. ధరణిలో ఏర్పడ్డ ఇబ్బందులు మళ్ళీ రిపీట్ కావద్దని, ఎట్టి పరిస్థితుల్లో పొరపాట్లు జరగొద్దని తెలిపారు.
ఆర్సీబీతో మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన కేకేఆర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 పున ప్రారంభానికి వరుణుడు భారీ షాక్ ఇచ్చాడు. ఈ మెగా టోర్నమెంట్లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేయబడింది. దీంతో చిన్నస్వామి స్టేడియం దగ్గర ఎడతెరిపి లేకుండా వాన పడుతుండటంతో టాస్ పడకుండానే మ్యాచ్ను అంపైర్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పీఎస్ఎల్వీ – సి61…
Bhatti Vikramarka : రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో ఆదాయం లేని పరిస్థితుల్లోనూ, అప్పులపై వడ్డీలు కట్టడం వంటి ఆర్థిక బాధ్యతలు వహిస్తూ సంక్షేమ పథకాలను నిలకడగా అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మధిర నియోజకవర్గం ఎర్రుపాలెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుపేదలకు ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చినా అమలు చేయలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నుంచే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం…